పాదయత్రలో ఉన్న జగన్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు... మీడియాలో సాక్షి తప్ప ఎవరూ చూపించటం లేదు... న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్ లో అయితే అసలు వార్త కూడా రావటం లేదు... నిజంగా జగన్ పాదయాత్ర చేస్తున్నాడా అనే డౌట్ కూడా ప్రజల్లో ఉంది... అయినా ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా స్క్రిప్ట్ పండిస్తూ, శుక్రవారం సెలవు తీసుకుంటూ, అలా నడుచుకుంటూ 50 రోజులు దాటాడు జగన్ (శుక్రవారాలతో కూడా కలిపి)... అయితే ప్రజల్లో పాదయాత్ర పేరు నాన్చటానికి ఏమి చెయ్యాల్లో తెలీక, చిత్ర విచిత్ర పనులు చేసినా మీడియా కవేరజ్ లేక, జగన్ టీం బాధ పడుతున్నారు... అందుకే మీడియా అటెన్షన్ కోసం ఇప్పుడు సినిమా డైలాగ్ లు చెప్తున్నారు జగన్...
సూపర్ స్టార్ రజనీకాంత్ భాష సినిమాలో ఫేమస్ డైలాగ్... "నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే" అనే డైలాగ్ ని వాడి, "నాన్న ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు వేస్తా" అంటూ అక్కడ తన వెంట వస్తున్న కార్యకర్తలను ఉద్దేశించిన అన్నారు.. చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేదు అని జగన్ చెప్తున్నారు.. అలాగే అవినీతి పై పోరాడే కసి తనకు ఉంది అని, తాను అధికారంలోకి రాగానే అవినీతి చేసిన వారి అందరినీ పట్టుకుని, జైల్లో పెడతాను అని, అది నా కసి అని జగన్ ప్రతి ఊరిలో చెప్తున్నారు...
అలాగే ఇంకో ఒక్క సంవత్సరంలో నేను సియం అవుతాను అని, నేను సియం అవ్వటానికి మీరందరూ గెట్టిగా దేవుడిని ప్రార్ధించండి అని జగన్ అన్నారు... తాను అధికారంలోకి వస్తే 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అని, బడికి పంపిస్తే పిల్లలకు ఎదురు డబ్బులు ఇస్తాను అని, వెయ్య రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ ఇస్తాను అని,ఇలా అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ, వెళ్తున్నారు జగన్... ఇప్పటి వరకు అభివృద్ధి గురించి కాని, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతాను అని కాని, ఉద్యోగాలు తెస్తాను, కంపెనీలు తెస్తాను, కేంద్రంతో పోరాడతాను అనే మాటలు మాత్రం అనకుండా, సినిమా డైలాగ్ లు మాత్రం వాడుతున్నారు..