వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాను ఎలా రక్తికట్టిస్తున్నారో చూస్తున్నాం... వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని, మొన్న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైసిపీ ఎంపీలు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

jagan 04062018 2

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి, రేపు, అంటే జూన్ 5న, వైసిపీ ఎంపీలను స్పీకర్ పిలిపించారు. రాజీనామా ఆమోదించే అవకాసం లేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో, డ్రామా అంతా బయట పడి పోతుంది అని, వైసిపీ అధినేత జగన్ స్పందించారు. బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కై వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుకున్నారంటూ, నెపం మొత్తం చంద్రబాబు మీదకు నెట్టేసారూ. వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా అంతా అమిత్ షా డైరెక్షన్ లో జరిగిందే అని అందిరికీ తెలిసిన విషయమే... రేపు ఎలాగూ స్పీకర్ రాజీనామాలు ఆమోదించారు కాబట్టి, నెపం చంద్రబాబుకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్.. ఒక పక్క, చంద్రబాబు, బీజేపీ పై నిప్పులు చేరుగుతుంటే, బీజేపీతో కలిసి కుట్ర పన్నారు అంటాడు...

jagan 04062018 3

వీళ్లేమో ఎప్పుడు చూసినా, ప్రధాని ఆఫీస్ లో ఉంటారు. బీజేపీ రాష్ట్రానికి ఎంతో న్యాయం చేసింది అంటారు.. అవిశ్వాసం అంటూ, అదే అవిశ్వాస తీర్మానం పట్టుకుని ప్రధాని ఆఫీస్ లో కనిపిస్తారు. బీజేపీని ఒక్క మాట అనకుండా, ప్రత్యేక హోదా పై పోరాటం చేస్తున్నాం అంటారు. జగన్ ఎంపీల చేత రాజీనామా డ్రామా ఆడించి, ప్రజల్ని రెచ్చగొట్టి, టిడిపి ఎంపీల పై ఒత్తిడి పెంచి, వాళ్ళ చేత కూడా రాజీనామా చేయించి, వాటిని ఆమోదించి, ఎన్నికలు సంవత్సరం లోపు ఉన్నాయి కాబట్టి, ఉప ఎన్నికలు రాకుండా, పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు లేకుండా, వారు బీజేపీని ఇబ్బంది పెట్టకుండా చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా, అమిత్ షా ఆడించిన రాజీనామా డ్రామా తెలుసుకుని, చంద్రబాబు ముందే జాగ్రత్త పడ్డారు... మేము రాజీనామా చెయ్యము, పార్లమెంట్ లో బీజేపీ ని ఎండగడతాం అంటుంటే, జగన్ మాత్రం అమిత్ షా, మోడీలను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఈ డ్రామాలో భాగస్వామి అయ్యి, ఇప్పుడు చంద్రబాబు వల్లే మా రాజీనామాలు ఆమోదం పొందలేదు అని చెప్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read