నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడువి, అసెంబ్లీకి రా అంటే, రానన్నాడు... కనీసం ప్రజల సమస్యలు చెప్పటానికి, నీ పార్టీ ఎమ్మల్యేలను అయినా అసెంబ్లీకి పంపు అంటే కుదరదు అన్నాడు... ఇవి బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర భవిష్యత్తుకి సంభందిచినవి మీరు రావాలి అంటే,నాకనవసరం అన్నాడు... ఇన్ని చెప్పాడు, చివరకు ఒక్క రోజు మాత్రం అసెంబ్లీకి వస్తాను అని సెలవిచ్చారు మన గౌరవ ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు... రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వెళ్తామని ఇవాళ చెప్పారు... అంతే కాని,బడ్జెట్ సమావేశాల్లో పాల్గునటానికి వెళ్ళమని చెప్పి, విస్మయానికి గురి చేసారు...
జగన్ నిర్ణయంతో, అందరూ అవాక్కయ్యారు... తన పార్టీకి వచ్చే రాజ్యసభ సీటు కోసం అయితే, అసెంబ్లీకి వెళ్తారు... జగన్ పాదయాత్ర ఆపి మరీ వెళ్తారు... కాని, ప్రజా సమస్యల పై మాత్రం, అసెంబ్లీ గుర్తుకు రాదా ? జగన్ కు ప్రజల బాధలు అవసరం లేదా, అంటూ విమర్శలు వస్తున్నాయి... శనివారం ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశయ్యి, ఈ నిర్ణయం ప్రకటించారు... దీంతో కొంత మంది ఎమ్మల్యేలు, ఇలా వోట్ వెయ్యటానికి మాత్రమే వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అసెంబ్లీ కూడా వెళ్దామని, కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని అనగా, జగన్ వారి మీద ఫైర్ అయ్యారు...
మీ పాత్ర ఎంత వరకు, అంత వరుకే ఉండండి... నేను లేకుండా, మీరు అసెంబ్లీ కి ఎలా వెళ్తారు అంటూ, జగన్ ఫైర్ అయ్యారు.... నా పాదయాత్ర అయ్యే వరకు, నేను లేకుండా అసెంబ్లీకి వెళ్ళే పనే లేదని చెప్పారు... పాదయాత్ర అయిన తరువాత, అప్పుడు చూద్దాం, అప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చెయ్యండి అంటూ, నేతలకు చెప్పారు.. ఇదే సందర్భంలో, మరి పార్లమెంట్ లో కూడా, మన ఎంపీలు టిడిపిలో చేరారు కదా, మరి పార్లిమెంట్ కూడా వెళ్ళకుండా ఉంటే బాగుటుంది, అలాగే అవిశ్వాసం అంటున్నాం, రాజీనామాలు అంటున్నాం, మళ్ళీ ఈ ఒక్క సీటు కోసం, అసెంబ్లీ దాకా వెళ్లి వోట్ వెయ్యటం ఎందుకు అన్నప్పుడు, జగన్ మరో సారి ఆ నేత పై ఫైర్ అయ్యి, నాకు ఏమి చెయ్యాలో తెలుసు అంటూ, గట్టిగా చెప్పటంతో, నిశబ్ద వాతావరణం నెలకుంది... మొత్తానికి, జగన్ అసెంబ్లీకి వస్తున్నారు... కాని ప్రజా సమస్యల పై కాదు, తన రాజకీయం కోసం...