ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి, ఈ రోజుకి ఏడు రోజులు అయ్యింది. ఈ రోజు కూడా సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలవరం పై తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు, ఇరిగేషన్ మంత్రి అనిల్ సమాధానం చెప్తూ, వాళ్ళు చేసేది ఏంటో చెప్పకుండా, చంద్రబాబు ఇలా చేసారు, అలా చేసారు అని చెప్పుకొచ్చారు. మొదటి మూడు ఏళ్ళు పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదని, చివరి రెండు సంవత్సరాలు ఎదో షో చేసారని అనిల్ అన్నారు. పునరావాసం విషయంలో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏమి పని చెయ్యలేదని, వాళ్ళను మోసం చేసారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని తరువాత, చంద్రబాబు చేసింది ఏమి లేదని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారని అన్నారు.

assemby 19072019 2

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికైనా మేమే పూర్తీ చేస్తాం అని అనిల్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభం జరుగుతుందని అన్నారు. దీని పై తెలుగుదేశం సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమాధానం చెప్తూ ఉండగా, వైసిపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజు క్వస్చిన్ హావర్ వేస్ట్ చేస్తున్నారని, స్పీకర్ తెలుగుదేశం సభ్యుల పై అసహనం వ్యక్తం చేసారు. ఈ దశలో జగన్ మోహన్ రెడ్డి మైక్ అందుకుని, గత మూడు రోజులుగా పోలవరం పై కావాలని చర్చ చేసే విధంగా తెలుగుదేశం సభ్యులు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఇటీవలే సందర్శించాను అని, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోవటానికి కారణం చంద్రబాబు చేసిన నిర్వాకాలే అంటూ, చెప్పుకొచ్చారు. మేము నవంబర్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఒక పేద స్కాం అని, దానిలో చంద్రబాబు విపరీతంగా సంపాదించారని జగన్ అన్నారు.

assemby 19072019 3

దీని పై ఒక కమిటీ వేశామని, మరో 15 రోజుల్లో ఆ కమిటీ చంద్రబాబు ఎంత దోచింది చెప్తుందని, అప్పుడు చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఈ విషయం చెప్తుంటే, చంద్రబాబు ఒక నవ్వు నవ్వి, జగన్ అజ్ఞానాన్ని తెలియపరిచారు. నిజానికి పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రతి పైసా కేంద్రం విడుదల చేస్తుంది. గతంలో చంద్రబాబుని ఆ డబ్బులు ఇవ్వటానికి కేంద్రం ఎన్ని కమిటీలు వేసి, పనులు అన్నీ చూసి , డబ్బులు వదిలిందో చూసాం. అంతే కాదు, రెండు రోజుల క్రితం రాజ్యసభ సాక్షిగా, ఇదే విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, పోలవరంలో అవినీతికి ఆస్కారం లేదని, సిబిఐ విచారణ అవసరమే లేదని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏ టెండర్ అయినా, ఏ పని అయినా కేంద్రం ఆధీనంలో జరుగుతుందనే విషయం కూడా తెలియకుండా, జగన్ ఓవర్ గా రియాక్ట్ అవ్వటం చూసి, చంద్రబాబు నవ్వుకుంటూ, నువ్వు ఇంత అజ్ఞానివి ఏంటి అన్నట్టు చూసారు. నిన్నటికి నిన్న కూడా కరెంట్ ఒప్పందులు విషయంలో, ప్రభుత్వానికి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read