ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తరువాత, ఆయన పై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు, చంద్రబాబుని ఎలా అయినా 2 ఏళ్ళలో జైలుకు పంపిస్తాం అంటున్నారు. ఇంకా చంద్రబాబే అధికారంలో ఉన్నారన్నట్టు, ప్రతి రోజు చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారు. ఆటు కేంద్రం సంగతి అలా ఉంటే, ఇటు జగన్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. కాకపోతే వాళ్ళు 2 ఏళ్ళు అంటుంటే, జగన్ మాత్రం, 45 రోజుల్లో తేలి పోవాలి అంటున్నారు. చంద్రబాబుని జైలుకు పంపటం కోసం, ఏకంగా ఒక క్యాబినెట్ సబ్-కమిటీని వేసారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చంద్రబాబుని ఏ ఏ విషయాలో ఇరికించాలి, ఎలా ఇరికించాలి అనే విషయం పై మాట్లాడటానికి నిన్న జగన్ ను కలిసారు. 45 రోజుల్లోనే అన్ని విషయాలు లోతుగా చూసి, చంద్రబాబు అవినీతి చేసారనే ఆధారాలు బయట పెట్టాలని జగన్ ఆదేశించారు.
చంద్రబాబు ప్రభుత్వం చేసిన 30 అంశాల పై గట్టిగా ఫోకస్ పెట్టాలని, క్యాబినెట్ సబ్ కమిటీకి జగన్ ఆదేశించారు. పోలవరం, సీఆర్‌డీఏ, మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభించిన వివధ పధకాలు, అన్నీ సమీక్ష చెయ్యాలని, దీని కోసం అధికారులను కూడా కలిసి, అన్ని వివరాలు తీసుకోవాలని జగన్ కోరారు. ప్రతి 5 రోజులుకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యి, చంద్రబాబుని ఎలా ఇరికించాలి అనే విషయం పై చర్చిస్తారు. అయితే ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 40 రోజులు అవుతున్నా, చంద్రబాబు పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా ప్రూవ్ చెయ్యక పోవటం పై జగన్ అసహనంగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు కూడా ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి బయట పడితే సన్మానిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు, ఎవరూ సరైన ఆధారాలు బయట పెట్టలేదు. ఇది ఇలా ఉంటే, తెలుగుదేశం నేతలు మాత్రం, చంద్రబాబుని ఏమి చెయ్యాలేరని, అంటున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ, స్పెషల్ టీం లు పెట్టి, చంద్రబాబు పై గత ఏడాదిగా ఫోకస్ పెట్టారని, ఎక్కడా వాళ్ళకు అవినీతి దొరకలేదని, ఇక్కడ జగన్ కూడా చేసేది ఏమి ఉండదని అంటున్నారు.