కేంద్రంలోని ప్రభుత్వం పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకొచ్చే అవకాశం ఉండటంతో, తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఫుల్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు... అయిదు కోట్ల ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా జాతీయస్థాయిలో మనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, చంద్రబాబు ఎంపీలకు సూచించారు... అయితే, జగన్ మాత్రం, తన ఎంపీలకు వేరే విధాలుగా ఆదేశాలు ఇచ్చారు... మనకు పై నుంచి స్క్రిప్ట్ వచ్చింది, రేపు అవిశ్వాసం పై చర్చకు వస్తుంది, మనం మన పాత్ర పోషించాలి అంటూ, వైసిపీ ఎంపీలకు జగన్ సోమవారం ఆదేశాలు ఇచ్చారు... అవిశ్వాసం పై చర్చలో, ఏమి మాట్లాడాలో ఎంపీలకు చెప్పారు...
అవిశ్వాసం పై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎంపీలను ఆదేశించినట్లు తెలిసింది... మనం మోడీ పై అవిశ్వాసం పెట్టాం అనే మెసేజ్ వెళ్ళకూడదు... మోడీ అనే మాట కూడా వద్దు... చివరలో మాత్రం, రిక్వెస్ట్ చెయ్యండి... చంద్రబాబుని మాత్రం అన్ని వైపుల నుంచి ఎదురుదాడి చెయ్యండి... వెన్నుపోటు, రెండు వేల ఎకరాలు, సింగపూర్ హోటల్, ఇలా అన్ని విషయాలు పార్లమెంట్ లో చెప్పండి... చంద్రబాబు పరువు మనం జాతీయ స్థాయిలో దిగాజార్చాలి.... ఇదే మన స్ట్రాటజీ కావలి అంటూ వైసిపీ ఎంపీలకు స్పష్టం చేసారు జగన్...
అలాగే, ఇప్పటికే మనం పార్లమెంట్ లో ఆందోళన చేస్తుంటే, బీజేపీకి కొంత ఇబ్బందిగా ఉండనే సమాచారం ఉంది.. ఇలాంటి పరిస్థితి మనం బీజేపీకి కలిపిస్తే, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి... పార్లమెంట్ నుంచి రాజీనామా చేసే పడేద్దాం... రాజ్యసభ నుంచి మాత్రం సాయాన్న రాజీనామా చెయ్యడు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి... అందుకే నేను ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామాలకు సిద్ధంగా ఉండండి, మీరు చెయ్యటమే కాదు తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయ్యమని చెప్దాం... ఇలా చేస్తే, అప్పుడు పార్లమెంట్ లో బీజేపీని ఇబ్బంది పెట్టే వారే ఉండరు, అంటూ తన ఎంపీలకు దిశానిర్దేశం చేసారు జగన్...