అమరావతి అంటేనే మొన్నటి వరకు ఒక ఎమోషన్. ఆంధ్రుడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నాం, ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీని కడుతున్నాం అంటూ గర్వంగా చెప్పుకున్న క్షణాలు. అందుకు అనుగుణంగానే, అక్కడ రైతన్నల త్యాగాలు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 33 వేల ఎకరాలు, ప్రభుత్వానికి ఇచ్చారు అక్కడ రైతులు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా, ఇది ఎలా సాధ్యం అని ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఒక ఎకరా బూమి సమీకరించాలి అంటే, ప్రభుత్వాలకు మామూలు తల నొప్పులు కాదు. అలాంటిది కేవలం చంద్రబాబు మీద నమ్మకంతో అక్కడ ప్రజలు, ఒక్క మాటకు విలువచ్చి, 33 వేల ఎకరాలు ఇచ్చేసారు. పనులు మొదలయ్యాయి. కాని ఈ లోపే ఎన్నికలు రావటం, చంద్రబాబు ఓడిపోవటం జరిగిపోయింది.
జగన్ మోహన్ రెడ్డికి అధికారం వచ్చింది. అయితే మొదటి నుంచి అమరావతి అంటే వ్యక్తిరేకత చూపించే జగన్, సహజంగానే అమరావతిని పట్టించుకోవటం ఆపేశారు. 40 వేల మంది కార్మికులతో సందడిగా ఉండే రాజధాని ప్రాంతం, ఇప్పుడు బోసి పోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ప్రభుత్వం రాజధాని కట్టక మానుతుందా అనుకునే ప్రజలకు, నిన్నటితో పూర్తీ క్లారిటీ వచ్చేసింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసారు. ఈ సందర్భంగా, మాకు అసలు ఇప్పుడే అమరావతి వద్దు అని తేల్చి చెప్పేశారు. అమరావతికి మేము మీ నుంచి రూపాయి కూడా అడగం అని చెప్పి, ఆ డబ్బులు నవరత్నాలకు ఇవ్వండి అని ప్రధానికి తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 5 వేల కోట్లు ఇవ్వమని అడిగారు.
అయితే అమరావతి ఇప్పుడే వద్దు అని కారణం చెప్తూ, అక్కడ పెద్ద స్కాం జరిగింది అనే అనుమానం మాకు ఉంది. విచారణ జరిపిస్తున్నాం. విచారణ పూర్తీ అయిన తరువాత, మిమ్మల్ని రాజధానికి డబ్బులు అడుగుతాం అని జగన చెప్పారు. ఇలా అనుమానం వచ్చి, విచారణ అయ్యే దాకా ఆగాలి అంటే అసలు అయ్యే పనేనా ? ఇలా అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు విచారణ అయ్యే దాకా, ఆయన సియంగా తప్పుకోవచ్చు కదా ? అసలు అమరావతి నిర్మాణానికి, విచారణకు సంబంధం ఏముంది ? నిర్మాణం చేస్తూనే, విచారణ జరుపుకోవచ్చు కదా ? ఎవరైనా రూపాయి ఇవ్వండి అని అడుగుతారు కాని, కేంద్రం దగ్గరకు వెళ్లి, మాకు ఆ ప్రాజెక్ట్ కు డబ్బులు ఇవ్వద్దు అంటే ఎలా ? అసలకే కేంద్రం గీసి గీసి డబ్బులు ఇస్తుంది. అలాంటిది, మనం ముందే వద్దు అంటే, ఎలా ? ఇలా అయితే అమరావతి సంగతి ఏంటి ? 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు శాస్వతం, జగన్, చంద్రబాబు శాస్వతం కాదు. చంద్రబాబు చేసారు కాబట్టి నేను చెయ్యను అనే జగన్ ధోరణి, రాబోయే ప్రభుత్వాలు తీసుకుంటే, ప్రజలు ఎంతో నష్టపోతారు.