జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల నుంచి, జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు... నాకు అధికార దాహం లేదు... అధికారం విలువ, బాధ్యత తెలుసు.. ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పను... ముఖ్యమంత్రి కావలి అంటే అనుభవం ఉండాలి... ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదు అంటూ పవన్ జగన్ పై వ్యాఖ్యలు చేసారు... నిజానికి ఈ వ్యాఖ్యల్లో నిజం లేక పోలేదు... గన్ ప్రతి సందర్భంలోనూ నేనే సియం నేనే సియం అని అంటున్న విషయం తెలిసిందే... పాదయాత్రలో కూడా ఎవరు ఏ సమస్య చెప్పిన, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తాను అంటూ వస్తున్నారు...
ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకోటి సాక్షిలో రాశారు... అది ఏంటి అంటే... "అన్నా నా పేరు కిరణ్ కుమార్, మా అమ్మానాన్న లీలావతి, వెంకట రాముడు. మాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం బంటనహళ్లి, మేం చాలా నిరుపేదలం. అనారోగ్యంతో బాధపడుతున్న నేను నిదానంగా చూపు కూడా కోల్పోయా, మా అమ్మానాన్న భయపడి నన్ను వెంటనే హైదరాబాద్లోని నిజాం ఆస్ప త్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. బ్రెయిన్కు ఆపరేషన్ చేయాలని, లేకపోతే బతకడం కష్టమన్నారు. ఆపరేషన్ చేయాలంటే రూ.5 లక్షలవుతుందని తేల్చిచెప్పారు.
అన్నా నాకు ఇంకా బతకాలని, మా అమ్మానాన్నను బాగా చూసుకోవాలనుంది. ఆపరేషన్ కు అయ్యే ఖర్చు భరిస్తే, నాకు పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమొస్తది' అంటూ కిరణ్ కుమార్ వైఎస్ జగన్తో గుత్తి సభలో మొరపెట్టుకున్నారు. దీనిపై జగన్ స్పందిసూ "మా పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ చేయిస్తానని అభయమిచ్చారు." అయ్యా జగన్ గారు, ఆయన ఏమో బ్రెయిన్ కు ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు... మీరేమో మీరు అధికారంలోకి వచ్చే దాకా ఆయన్ను ఆపరేషన్ చేయించుకోవద్దు అంటున్నారు... అయినా, 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వదా ? మీరు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే సియం రిలీఫ్ ఫండ్ ఇవ్వదా ? సరే ప్రభుత్వం ఇవ్వటం లేదు, మీరు, మీ పార్టీ వారు అందరూ ఒక 5 లక్షలు ఇవ్వలేరా ? దీనికి కూడా మీరు అధికారంలోకి రావాలా ? ఇందుకు కాదు, మిమ్మల్ని అందరూ తిట్టేది...