కేసీఆర్ ఏపి రాజకీయాల్లో వేలు పెట్టటం ఏమో కాని, ఇక్కడ కొంత మంది మాత్రం, వీర లెవెల్లో రెచ్చిపోతున్నారు. అప్పట్లో స్వతంత్ర పోరాటం చేసే క్రమంలో, ఇక్కడ కొంత మని మన దేశంలో విష పురుగులు, బ్రిటీష్ వారితో కలిసి, సొంత మాతృభూమికే అన్యాయం చేసారు. ఇలాంటి విష పురుగులు, ఇప్పుడు ఏపిలో కూడా తయారయ్యాయి. ఏపి ప్రజలను ఛీ కొట్టి, కుక్కలు, రాక్షులు అని, చివరకు మనం తినేది పెంట అని సంభోదించినా, ఇక్కడ కొంత మందికి మాత్రం, కేసీఆర్ అంటే ప్రేమ కారిపోతుంది. మన కష్టంతో నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి మనలను గెంటేసి, కనీసం రాజధాని కూడా లేకుండా, ప్రయాణం ప్రారంభించిన మన ధుస్తుతికి కారణం అయిన కేసిఆర్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ, మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే, ప్రత్యెక హోదా ఇస్తాం అంటే, కేసీఆర్ తెలంగాణాలో కూర్చుని, మా రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా, ఏపికి ఇస్తే ఊరుకునేది లేదు అంటూ బహిరంగ సభలో చెప్పారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే, దాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి కేసీఆర్ ని ఏపి ప్రజలందరూ తిరస్కరిస్తుంటే, జగన్ మాత్రం కేసీఆర్ ముద్దు అంటున్నారు. మనకు నీళ్ళు ఇవ్వద్దు అంటున్న వాడిని కౌగలించుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నావ్ అంటే, మీకెందుకు అంటున్నారు. నిన్న జగన్ వ్యాఖ్యలు దీనికి నిదర్సనం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం మద్దతు ఇస్తున్నారని జగన్ పేర్కొన్నారు. కేసీఆర్ మద్దతు తీసుకుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
సోమవారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నూలు జిల్లా ఆదోని, చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాడిపత్రి సభలో కేసీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘కేసీఆర్ మద్దతిస్తున్నది మాకా? ప్రత్యేక హోదాకా? ఏపీకి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతిస్తుంటే... చంద్రబాబు ఎందుకు అభ్యంతరం? జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం తోడుగా ఉంటే... రాష్ట్రాల హక్కులు కాపాడుకోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రాల సమస్యలు పరిష్కరించేందుకు... ఇంకా, మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు పలికారు. దానికి హర్షించాల్సిందిపోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా?’’ అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న 25మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది జత అయితే, మొత్తం 42 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదాకోసం మద్దతిస్తే... హర్షించాల్సిందిపోయి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తావా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సతో పొత్తుకు టీడీపీ ప్రయత్నించలేదా అని నిలదీశారు.