విజ‌య‌సాయిరెడ్డిని కొన్నాళ్లుగా తాడేప‌ల్లి ప్యాలెస్‌కి దూరం పెడుతూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ రెడ్డికి అన్నీ తానై ఒక‌ప్పుడు న‌డిపించే విజ‌య‌సాయిరెడ్డికి ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి అపాయింట్మెంట్ దొర‌క‌డంలేద‌ని టాక్. అయితే వైకాపా అధినేత పిలిచినా వెళ్లేందుకు సాయిరెడ్డి సుముఖంగా లేర‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్న మాట‌.ఉత్త‌రాంధ్ర‌కి ముఖ్య‌మంత్రిగా అధికారం చెలాయించే విజ‌యసాయిరెడ్డిని మొద‌ట ఆ స‌మ‌న్వ‌య‌క‌ర్త పోస్టు పీకేశారు. ఆ త‌రువాత అనుబంధసంఘాల అధ్య‌క్ష ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌ట చేశారు. సోష‌ల్మీడియా ఇన్చార్జి పోస్టుని స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డికి క‌ట్ట‌బెట్టేశారు. ఢిల్లీలో వైకాపా లాబీయింగ్ చూసే విజ‌యసాయిరెడ్డిని త‌ప్పించి మిధున్ రెడ్డికి అప్ప‌గించారు. దీంతో ప‌వ‌ర్, ప‌ద‌వుల్లేని సాయిరెడ్డి మౌనం పాటిస్తూ వ‌స్తున్నారు.
వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి జ‌నంలో ఇమేజ్ దెబ్బ‌తింది. పార్టీలో ఎమ్మెల్యేలు తిర‌గ‌బ‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో సొంత బంధువు అయిన బాలినేని శ్రీనివాస‌రెడ్డి అల‌క‌బూనారు. బాలినేని స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌ద‌వి వ‌ద్ద‌ని వ‌చ్చేశారు. ఈ పోస్టుని ఎలాగైనా సాయిరెడ్డికి క‌ట్ట‌బెట్టి, ఆ ప్రాంత ఓట‌మిని సాయిరెడ్డి ఖాతాలో వేసేయాల‌ని సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రెడ్డి బ‌ల‌మైన వ్యూహం ప‌న్నారు. అయితే తెలివిగా సాయిరెడ్డి త‌ప్పించుకు తిరుగుతూ ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంలేదు. ఢిల్లీలోనూ బీజేపీ పెద్ద‌ల‌తో లాబీయింగ్ చేసుకుంటూ, టిడిపిని తిట్ట‌కుండా సోష‌ల్మీడియా స్ట్రాట‌జీ మార్చేశాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read