5 కోట్ల ఆంధ్రులను నమ్మించి మోసం చేసి, ఢిల్లీ అహంకారాన్ని, ఆంధ్రుల పై రుద్దుతున్న మోడీ పై, యావత్త ఆంధ్రప్రదేశ్ ఆందోళన చేస్తుంటే, వైసీపీ అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి మాత్రం, ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మోడీ సభకు ఒక పక్క జగన్, ఒక పక్క మోడీ ఫోటోలు, జెండాలు పెట్టి మరీ ప్రజలను తరలిస్తున్నారు. మరో పక్క, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు, మోడీకి స్వాగతం పడుతూ, బ్యానర్లు కట్టారు. బీజేపీ..వైసీపీ అక్రమ సంబంధానికి ఇంతకంటే రుజువులు కావాలా?? రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వెనకనుండి మద్దతు ఇచ్చింది ఎవరో తెలిసిందా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. ఇవ్వడం కుదరదు అన్న బీజేపీ తో కలిసి హోదా తెస్తారా వీళ్ళు....?? కేసుల కోసం మోడీ కాళ్లదగ్గర మొకరిల్లే వీళ్ళ వలన రాష్ట్రానికి ప్రయోజనం ఉందా??
బీజేపీతో టీడీపీ కటీఫ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నవ్యాంధ్రకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత... అక్కడికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వరకు బాగానే ఉన్నా... మోదీ బహిరంగ సభ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభ ‘ఫ్లాప్’ అయ్యింది. బీజేపీ నేతలు మూడువేల కుర్చీలు వేశారుకానీ, మూడొందల మందిని కూడా సమీకరించలేకపోయారు.
దీంతో అమిత్ షా సభా వేదిక కూడా ఎక్కకుండా... బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... మోదీ సభకు జన సమీకరణ చేయడంపై బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని సమీకరించటం అంత సులువు కాదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ‘ఏది ఏమైనా, ఎలాగైనా’ మైదానం నిండాలని... దీనికోసం టీడీపీ వ్యతిరేక పక్షమైన వైసీపీ సహాయం తీసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వైసీపీ కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నారు.