వైకాపా అధినేత జగన్‌ మరోసారి శవరాజకీయం మొదలు పెట్టారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలని ప్రయత్నించి.. చావు దెబ్బతిన్నా జగన్‌కు బుద్ధిరాలేదని దుయ్యబట్టారు. దొంగ పత్రికతో కుల రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. కొండవీడులో వ్యక్తిగత కారణాలతో రైతు కోటయ్య చనిపోతే వైకాపా నేతలు కనీసం సానుభూతి కూడా తెలపలేదన్నారు. రైతు ఆత్మహత్యను రాజకీయానికి వాడుకోవడమే వైకాపా అజెండా అని విమర్శించారు. రైతు పొలానికి, సీఎం హెలిప్యాడ్‌కు సంబంధం లేదనే విషయం వైకాపా నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. వైకాపా శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు జవాబు చెబుతారన్నారు.

sevam 20022019 2

ఇదే విషయం పై గుంటూరు పోలీసులు కూడా స్పందించారు. రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే.. వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని మంగళవారం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇచ్చారు.

sevam 20022019 3

రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని అన్నారు. ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు అక్కడ గస్తీ పోలీసులకు సమాచారం అందిందని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌.. కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. పోలీసులంతా అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనాన్ని ఏర్పాటుచేసి ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు. ఈ దుర్ఘటన సీఎం పర్యటనకు దాదాపు నాలుగుగంటల ముందు చోటు చేసుకుందని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read