జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటుగా, కొంత మంది కేంద్ర మంత్రులను కూడా జగన్ మోహన్ రెడ్డి కలిసారు. అయితే ఎప్పటిలాగే ఢిల్లీలో మాత్రం ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ జగన్ మోహన్ రెడ్డికి లభించ లేదు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు, ప్రధాని మోడీతో పాటుగా, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా జగన్ అడిగారని ప్రచారం జరిగింది. అయితే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అయితే దొరికింది కానీ, ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. గతంలో కూడా నాలుగు అయుదు సార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. సోమవారం, మంగళవారం కూడా జగన్ కార్యాలయం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసారు. నిన్న ఉదయమే వచ్చేయాల్సి ఉండగా, మధ్యానమైనా అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని ఎదురు చూసినా, అమిత్ షా అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. దీంతో మూడు గంటలకు జగన్ మోహన్ రెడ్డి గన్నవరం బయలు దేరి వచ్చేసారు. అయితే అసలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నా, అంత మంది కేంద్ర మంత్రులను కలిసిన జగన్, కీలకమైన అమిత్ షా అపాయింట్మెంట్ కోరకుండా ఎందుకు ఉంటారు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read