జగన్ బ్యాచ్ కు ఉన్న మరో అస్త్రం కూడా ఇవాల్టితో పోయింది... సంవత్సరం నుంచి మోడీ, చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వటంలేదు అంటూ, సొంత మీడియాలో, సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ తో నానా హడావిడి చేసారు... చంద్రబాబు అవినీతి చేసారు అని అందుకే అపాయింట్మెంట్ దొరకటంలేదు అని ప్రచారం చేసారు... ఈ పాయింట్ మీద ఎన్నో కధనాలు రాసారు, ముఖ్యమంత్రి పరువు తీసారు... ఎక్కడైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఢిల్లీ మీద పోరాటం చేసే ఆత్మగౌరవం ఉండటం చూసాం కాని, ఇక్కడ రివర్స్ లో ఎంజాయ్ చేసారు..
కాని ఇవాల్టితో ఆ ఆనందం పోయింది... జనవరి 12న ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రధాని మోడీ... చంద్రబాబు అడగకుండానే నిన్నే తనను కలిసిన ఎంపీలతో, మీ ముఖ్యమంత్రిని తొందరలోనే కలుస్తాను అని చెప్పి, ఇవాళ చంద్రబాబుని రమ్మని కబురు పంపారు... మొన్న విజయసాయి రెడ్డి ప్రధానిని కలవటంతో జగన్ బ్యాచ్ మరింత రెచ్చిపోయింది... చంద్రబాబు అంటే మోడీకి ఇష్టం లేదు అని, మా వాడిని కలిసాడు కాని, మిమ్మల్ని కలవలేదు అని ప్రచారం చేసారు.. జగన్ కూడా, తన పాదయాత్రలో ఇదే హడావిడి చేసారు.. ఇదే ప్రసంగం కూడా చేసారు..
ఇది ఒక వైపు అయితే, రెండో వైపు జగన్ తన కేసులు నుంచి ఊరట పొందటానికి, తన పార్టీని బీజేపీకి బేరం పెట్టారు అనే ప్రచారం కూడా నడుస్తుంది... రాజకీయంగా బీజేపీకి, జగన్ పార్టీతో కంటే, తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ లాభం.. అందునా ఇక్కడ చంద్రబాబు లాంటి ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు.. ఇప్పుడు మోడీ కనుకు చంద్రబాబుతో కలిసిపోతే, చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతే, కేసులు ఇక క్లైమాక్స్ వచ్చేస్తాయి అని భయం జగన్ కు పట్టుకుంది... ఇన్నాళ్ళు కష్టపడి ఇద్దరికీ గ్యాప్ క్రియేట్ చేస్తే, ఇద్దరూ ఇలా కలిసిపోయారు ఏంటి అని జగన్ బాధపడుతున్నారు... పరిణామాలు ఇలాగే ఉంటే, కొన్ని రోజులు వేచి చూసి మోడీ మీద కూడా అటాక్ మొదలు పెట్టటానికి సిద్ధంగా ఉండాలని తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు జగన్...