నేనే సియం నేనే సియం అంటూ, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులతో, 16 నెలలు జైల్లో ఉండి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి ఈ దేశంలో, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే ఎవరన్నా ఉన్నారా అంటే, అది మన ఖర్మకు మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. కోర్ట్ లు కూడా, ఆర్ధిక ఉగ్రవాది అని సంభోదించాయి అంటే, మనోడి పవర్ అలాంటిది మరి. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ, అనునిత్యం మన రాష్ట్ర నాశనం కోసం, రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపి, నేను సియం అవుతా అంటూ తిరుగుతున్నాడు. అంటే ఈయన సియం అయ్యి, మన రాష్ట్రం మొత్తం తీసుకువెళ్ళి, కేసీఆర్ చేతిలో, మోడీ చేతిలో పెడతాడా ? అసలు ఈ మనిషికి నిజంగా రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా ?
ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండగానే, తాజాగా జగన్ మోహన్ రెడ్డికి కోర్ట్ కి విధించిన ఆంక్షలు చూస్తే, ఇలాంటి వాడా మన నేత అని సిగ్గు పడాలి. విషయానికి వస్తే, జగన్‌మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 18 నుంచి మార్చి 15 మధ్య పది రోజుల పాటు జగన్ లండన్‌లో పర్యటించేలా ఏడాది కాలపరిమితితో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే, లండన్‌లో జగన్ పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్‌ఫోన్, సెల్ నంబరు, ఈ-మెయిల్, ఫ్యాక్స్ నంబర్లను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2 నిందితుడైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇన్ని ఆంక్షలు కోర్ట్ విధించింది అంటే, వీళ్ళు ఈ దేశానికి ఎంత ప్రమాదకారులో ఆలోచించండి. సొంత కూతురు దగ్గరకు వెళ్ళాలన్నా, కోర్ట్ పర్మిషన్ ఇస్తే కాని వెళ్ళలేని వ్యక్తి, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా ? అప్పట్లో బెయిల్ కోసం, సమైఖ్యంద్ర ఉద్యమం సోనియా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, బయటకు వచ్చి ఆ ఉద్యమం నీరు కార్చాడు. ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్ళకుండా ఉండటానికి, ప్రత్యెక హోదా ఉద్యమం తాకట్టు పెట్టి, కనీసం ఒక్క విభజన హమీ గురించి కూడా మోడీని నిలదియ్యలేని వ్యక్తి, ఈ రాష్ట్రానికి అవసరమా ?