మొన్నటి దాక కాపులకు రిజర్వేషన్‌ ఎప్పుడు చేస్తున్నారు, వారు అన్యాయం అయిపోతున్నారు అంటూ, హడావిడి చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు కాపులకు రిజర్వేషన్‌ పై నిర్ణయం తీసుకుని, కేంద్రానికి పంపించారో, అప్పటి నుంచి జగన్ ఈ విషయం పై నోరు తెరవటం లేదు. అయితే, తాజగా తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్‌ ప్రజా సంకల్పయాత్ర శనివారం జగ్గంపేటకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతుండగా కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు ప్లకార్డులు పట్టుకుని, కాపు రిజర్వేషన్‌ పై వైఖరి చెప్పాలి అంటూ నినాదాలు చెయ్యటంతో, అసహనానికి లోనైన జగన్, కాపులకు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనికి, అది ఇవ్వటం కుదరదు, నేను అధికారంలోకి వస్తే, ఎక్కువ నిధులు మాత్రం ఇస్తాను అని చెప్పారు.

jagan 29072018 3

దీని వెనుక ప్రధాన కారణం, ఇప్పుడు కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలో ఉంది. ఈ విషయం పై ఏమి మాట్లాడినా, కేంద్రాన్ని ప్రశ్నించాలి. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము మనోడి దగ్గర లేదు కాబట్టి, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడు. జగన్ అంటున్నట్టు, కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలోనిది నేను ఏమి చెయ్యలేను అంటే, ప్రత్యేక హోదా కూడా కేంద్రం పరిధిలోనిదేగా ? దాని కోసం ఎలా కేంద్రం పై ఉద్యమాలు చేస్తున్నామో, దీని పై కూడా అలాగే చెయ్యాలి. కేంద్ర పరిధిలోనిది అని చెప్పి, ప్రతి విషయం ఇలా తప్పించుకుంటే ఎలా ?

jagan 29072018 2

సరే, రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిదని అందరికీ తెలుసు.. అసలు ఆ అంశానికి మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పకుండా తప్పించుకోవడం ఏమిటి..? ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది.. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది.. దాన్ని కేంద్రప్రభుత్వం షెడ్యూల్ నైన్ లో పెడితే పనైపోతుంది.. ఆ విషయంపై జగన్ ఎలాంటి వైఖరీ చెప్పలేదు.. కేంద్రాన్ని డిమాండ్ చేయనూ లేదు.. అలాగే చేస్తాను అనీ చెప్పలేదు.. ఇవన్నీ పక్కన పెడదాం, జగన్ మోహన్ రెడ్డి 2014 మేనిఫెస్టోలో, కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని ఎందుకు చెప్పాడు ? ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాడు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read