వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడు జగన మోహన్ రెడ్డి, తన ముఖ్యమంత్రి కుర్చీ సంకల్పం కోసం, పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే... జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నడుస్తున్నారు... అయితే ఇప్పుడు ఒక విషయం పై ప్రజలు చర్చించుకుంటున్నారు... జగన మోహన్ రెడ్డి కాణిపాకం వినాయకుడికి 14 కిలోమీటర్ల ముందే వేరే రూట్ తీసుకున్నారు అని, ఇలా ఎందుకు చేసారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు... పాదయాత్ర చేస్తూ పూతలపట్టు దాకా వచ్చిన జగన్, ఇంకొంచెం దూరం వచ్చి వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు... వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందిన గుడికి జగన్ వెళ్ళకపోవటానికి ప్రధానంగా ఒక కారణం చెప్తున్నారు...
సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు... కాణిపాకం-వినాయకుడికి సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది.... అందుకే ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు, కాణిపాకం-వినాయకుడి ముందు తడి బట్టలు కట్టుకుని చెప్పు అని కూడా అంటారు... అలాంటి గుడిలో జగన్ రావటానికి సాహసించలేదు అని స్థానికులు అంటున్నారు... ఎందుకంటే జగన్ రోజు పాదయాత్రలో చెప్పేవి అన్నీ అబద్ధాలే... తన గురించి చెప్పినా, ఇతరులు గురించి విమర్శలు చేస్తున్నా అన్నీ అబద్ధాలే, అందుకే జగన్ ఆ గుడిలోకి వచ్చి, వినాయకుడుకి దండం పెట్టే సాహసం చెయ్యలేదు అంటున్నారు...
నిజానికి జగన్ ఏ రోజు ఎటు పాదయత్ర చేస్తాడో, చివరి నిమషం వరకు చెప్పరు... ఒకటి, రెండు రోజులు ముందు మాత్రమే పాదయత్ర షడ్యుల్ ఇస్తున్నారు... దీంతో జగన్, పూతలపట్టు దాకా వచ్చారు కాబట్టి, ప్రసిద్ధి గాంచిన కాణిపాకం గుడికి వస్తారు అని అక్కడ స్థానికి వైసీపీ నేతలు కూడా అనుకున్నారు.. తిరుపతి వచ్చారు కాబట్టి, ఇక్కడకు రావటానికి జగన్ కు ఇబ్బంది ఉండదు కదా, కచ్చితంగా వస్తారు అని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు... అందునా, సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు కాబట్టి, అన్ని మతాల వారు ఇక్కడకు వస్తారు కాబట్టి, ఏఇబ్బంది ఉండదు అనుకున్నారు... కాని, అక్కడ రివర్స్ లో జరిగే సరికి, అక్కడ స్థానిక నేతలు కూడా జగన్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేసారు...