ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో ముఖ్యమైనది. చెప్పాలంటే, అధికార పక్షం కంటే, ప్రతిపక్షమే, ప్రజలకు మేలు చేస్తుంది. ప్రజల తరుపన నిలబడుతుంది, పోరాడుతుంది, ప్రభుత్వాలను సరిగ్గా పని చేసేలా చేస్తుంది. చట్ట సభల్లో, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపి, అనేక చర్చల్లో పాల్గుని, ప్రజల సమస్యలు ప్రభుత్వాలకి చెప్పి, ప్రజల తరుపున పోరాడుతుంది. ఎన్ని రాజకీయాలు చేసినా, ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం అంటే ఇలాగే ఉంటుంది. కాని, మన కొత్త రాష్ట్రం చేసుకున్న దురదృష్టం, మన ప్రతిపక్షం మాత్రం, అసెంబ్లీకి వెళ్ళరు.. పార్లమెంట్ కు వెళ్ళరు... రోడ్ల మీద ముద్దులు పెడుతూ, ప్రజల నెత్తిన టోపీ పెడతారు... అసెంబ్లీకి, పార్లమెంట్ కు వెళ్లకపోయినా, ప్రతి శుక్రవారం కోర్ట్ మెట్లు మాత్రం ఎక్కుతారు.

jagan 1907201 2

మన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి, సంవత్సరం దాటింది. ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాకుండా పోయాయి. కాపు రిజర్వేషన్, సహా అనేక బిల్లుల పై ప్రతిపక్షం చర్చల్లో పాల్గునలేదు. ఎంత ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నా, ప్రతిపక్షం ఉండి, చర్చల్లో పాల్గుని సూచనలు ఇస్తే ప్రజలకు మేలు ఉంటుంది. చివరకు కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా జగన్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రాక పోగా, రోడ్ల పై తిరుగుతూ, రెండు సంవత్సరాల ముందు నుంచే, నేను సియం అయిన తరువాతే మీ సమస్యలు పరిష్కరిస్తా అంటూ, తన దగ్గరకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు చెప్తున్నారు.

jagan 1907201 3

ఇక పార్లిమెంట్ తీరు కూడా అంతే. ఎందుకు రాజీనామా చేసారో తెలియదు. అసలు రాజీనామా చేసి ఏమి సాధించారో తెలియదు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పై చర్చలో వైసిపీ ఉండి ఉంటే, మరో 15 నిమషాల సేపు, మన రాష్ట్ర సమస్యలు ఈ దేశానికి చాటి చెప్పే అవకాశం ఉండేది. కాని, బీజేపీతో కుమ్మక్కు అయ్యి, వారికి ఇబ్బంది లేకుండా, వారిని విమర్శించే పని లేకుండా, రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు. ఈ సమయంలో వీరు పార్లమెంట్ లో ఉంటే, మరి కాస్త ఒత్తిడి కేంద్రం పై ఉండేది. ఇది మన ప్రతిపక్షం తీరు. అసెంబ్లీకి వెళ్ళరు.. పార్లమెంట్ కు వెళ్ళరు... కాని ప్రతి శుక్రవారం మాత్రం కోర్ట్ కి వెళ్ళాల్సిందే... ఇదీ మన ప్రతిపక్షం, మన ఖర్మ... రేపు అవిశ్వాసం కూడా శుక్రవారమే..

Advertisements

Advertisements

Latest Articles

Most Read