గత వారం సిబిఐ కోర్ట్ లో జగన్ మోహన్ రెడ్డికి, ఇబ్బందులు ఎదురైనా సంగతి తెలిసిందే. తనకు ప్రతి శుక్రవారం కోర్ట్ విచారణ నుంచి మినహాయింపు కావాలని, వైఎస్ జగన్ వేసిన పిటీషన్ పై, సిబిఐ కోర్ట్ గత వారం కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ శుక్రవారం జగన్ మొహన్ రెడ్డి, కోర్ట్ కు హాజరు అవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోనే ఉండటంతో, ఆయన ఇక హైదరాబాద్ వెళ్ళే అవకాసం లేదు. అయితే, జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు ఒక్క శుక్రవారం కూడా కోర్ట్ కు వెళ్ళలేదు. దాని కోసం ప్రతి వారం ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ఆయన సియం కాబట్టి, అనేక కార్యక్రమాలు ఉన్నాయని చెప్తూ, ప్రతి వారం కోర్ట్ నుంచి మినాహయింపు కోరుతున్నారు. అయితే, ఈ వారం కూడా అలాంటి, ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చెయ్యటానికి, జగన్ న్యాయవాదులు రెడీ అయ్యారు. దీంతో ఈ వారం కూడా, జగన్ కోర్ట్ కు వెళ్ళటం లేదు.
అయితే సిబిఐ కోర్ట్ పిటీషన్ కొట్టివేయటంతో, జగన్ తరుపు న్యాయవాదులు, హైకోర్ట్ కు వెళ్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు జగన్ తరుపు న్యాయవాదులు హైకోర్ట్ కు వెళ్ళలేదు. సిబిఐ కోర్ట్ తీర్పు విశ్లేషించుకుంటున్న జగన్ తరుపు న్యాయవాదాలు, పై కోర్ట్ లకు వెళ్ళినా, ఇలాంటి తీర్పు వచ్చే అవకాశమే ఉందని, మళ్ళీ అక్కడ కోర్ట్, జగన్ పై ఏమైనా వ్యాఖ్యలు చేస్తే, రాజకీయంగా ఇబ్బంది అవుతుందని, అందుకే దూకుడుగా వెళ్ళకుండా, ఏ మార్గంలో వెళ్తే, కోర్ట్ ని ఒప్పించవచ్చు అనే అంశం పై, సమాలోచనలు జరుపుతున్నారు. మరో పక్క సిబిఐ కోర్ట్ తన తీర్పులో, ఇది వరుకే ఈ పిటీషన్ మా దగ్గరకు వచ్చింది, మేము ఒప్పుకోలేదు, హైకోర్ట్ కు వెళ్లారు, అక్కడ కూడా కొట్టేసింది, మీరు మళ్ళీ మా వద్దకు రాకుండా, సుప్రీంకు వెళ్ళండి అని సూచించిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు జగన్ తరుపు న్యాయవాదాలు, దీని పై సమగ్రంగా విశ్లేషించుకుంటున్నారు. ఈసారి కోర్ట్ కు వెళ్తే మాత్రం, బలమైన వాదనలతో వెళ్ళాలని, ఇప్పుడు సిబిఐ కూడా గట్టిగా వాదనలు వినిపిస్తూ ఉండటంతో, ప్రతి అంశం పై క్లారిటీతో వాదనలను జరపలాని, అందుకే మొత్తం అంశం పై టైం తీసుకుని, మళ్ళీ కోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు కూడా, ప్రతి శుక్రవారం, జగన్ కోర్ట్ కు వెళ్ళకుండా, అబ్సేంట్ పిటీషన్ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క గత అయుదు నెలలుగా ఇలాగే చేస్తున్నామని, సిబిఐ కోర్ట్ ఎంత వరకు, ప్రతి వారం అబ్సేంట్ పిటీషన్ కు ఒప్పుకుంటుంది అనే చర్చ కూడా జగన్ తరుపు న్యాయవాదాల్లో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, జగన్ కోర్ట్ కు వెళ్ళకపోతే, రాష్ట్ర ఖజానాకు 60 లక్షలు ఆదా అవుతాయి అంటూ, వ్యంగ్యంగా స్పందిస్తుంది.