ఎవరైనా ఒకసారి తప్పు చేస్తారు... బుర్ర ఉన్నాడు, ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాడు... చేసిన తప్పే, కావాలని మళ్ళీ మళ్ళీ చేసి, దాన్ని సమర్ధించుకునే వారికి, పేటెంట్ మాత్రం జగన్ కే ఉంటుంది... వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలకు సైతం హాజరుకాకూడదని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి, ఇప్పటికే తన పార్టీ ఎమ్మల్యేలకు లోటస్ పాండ్ నుంచి ఎస్ఏంఎస్ లు వెళ్ళాయి... ఈ సారి బడ్జెట్ లాంటి కీలకమైన సమావేశాలు కాబట్టి, అసెంబ్లీకి వెళ్ళటానికి జగన్, పర్మిషన్ ఇస్తారని అందరూ అనుకున్నారు... కాని, జగన్ మళ్ళీ అదే పాట పాడటంతో, ఎమ్మల్యేలు అవాక్కయ్యారు... ప్రజా సమస్యల పై కాకుండా, పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకూ తాము సభలో అడుగుపెట్టేది లేదంటూ.. గతంలో సమావేశాలను బహిష్కరించిన వైసీపీ, మర్చి 5 నుంచి ప్రారంభంకానున్న కీలకమైన బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా అదే విధానం కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ ఎంపీలు చేస్తున్న హడావిడి మీడియాలో కవర్ కావలి అంటే, ఎమ్మెల్యేల పాత్ర కూడా కావాలని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయితే ఆ కార్యక్రమాలపై ఫోకస్ తగ్గుతుందన్న ఆందోళన కూడా జగన్ లో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తమ నాయకత్వం అనుసరిస్తోన్న తీరు పై మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో సర్కారు నిర్ణయాలు, వివిధ శాఖలకు కేటాయింపులపై నిలదీసే అవకాశాన్ని చేతులారా దూరం చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమేనన్న అభిప్రా యంతో ఉన్నారు.
జగన్ పాదయాత్రలో ఉన్నందున, ఆ కార్యక్రమం జరిగే నియోజకవర్గ ఎమ్మెల్యేని మినహాయించి, మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయితే బాగుంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ లేకుండా అసెంబ్లీకి వెళ్తే, కొత్త వారికి లీడ్ తీసుకునే అవకాసం వస్తుందని, ఎమ్మల్యేల పనితీరు, సత్తా, అవగాహన శక్తి ఏమిటన్నది కూడా నాయకత్వానికి ఒక అవగాహన, అంచనా వస్తుందని చెబుతున్నారు. కాని, జగన్ మాత్రం, తాను లేకుండా, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళకూడదు అని, తన స్థానం వేరే వారికి ఇచ్చే ప్రసక్తే లేదని, తాను తప్ప ఎవరు ఫోకస్ కావటానికి వీలు లేదని తేల్చి చెప్పేశారు..