కర్నూల్ జిల్లలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు, ఇవాళ జగన్ మాట విని, తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. జగన్ మాట విని, అటు డబ్బులు పోయి, ఇటు పదవులు పోయి, ఇటు జిల్లలో పట్టు పోయి, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చారు. నేను మొగోడిని... మీరు ఆడెంగులు... ఆట ఇప్పుడు మొదలైంది అంటూ, నంద్యలలో ఒక పెద్ద సభ పెట్టి, జగన్ పక్కన కుర్చిని రెచ్చిపోయిన శిల్పా చక్రపాణి రెడ్డికి, అటు ఉన్నదీ పోయింది, ఇటు ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయ్యింది పరిస్థితి... భుమా నాగిరెడ్డి చనిపోయే రోజు వరుకు, శిల్పా చక్రపాణిని ఎమ్మల్సీ చెయ్యటం కోసం ప్రచారం చేశారు... భుమా చనిపోయినా, శిల్పా చక్రపాణి గెలిచారు... కాని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేసి, చివరకు ఛాలెంజ్ లేకుండా తోక ముడిచి పారిపోయాడు...
చంద్రబాబు భుమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నప్పుడే, శిల్పా సోదరులకి, భుమా కుటుంబానికి మధ్య సంధ్య కుదిరించారు. కలిసి పని చేసి, జిల్లా అభివృద్ధి కోసం పటు పడమన్నారు. చెప్పినట్టే, భుమా నాగి రెడ్డి కూడా, శిల్పా చక్రపాణి MLC కోసం, కష్టపడి గెలిపించారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో, భుమా నాగి రెడ్డి మరణించటం, శిల్పా మోహన్ రెడ్డి, ఆ టికెట్ అడగటం, సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి కుటుంబానికే టికెట్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పటంతో, శిల్పా మోహన్ రెడ్డి తొందర పడి, జగన్ పార్టీలో చేరారు.
నంద్యాల ప్రజల నాడి పట్టటంలో శిల్పా సోదరులు ఫెయిల్ అయ్యారు. జగన్ మాట విని, గెలిసేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టారు. చివరకి ఘోరంగా పిల్లల చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మల్సీగా పోటీ చెయ్యటానికి కూడా భయపడి పారిపోయారు. ప్రజల నాడి తెలుసుకోకుండా, జగన్ చెప్పిన మాటలు విని, ఇటు ఆర్ధికంగా దెబ్బ తినటం, బంగారం లాంటి పదవులు పోవటం, అన్నిటికీ మించి ప్రజల్లో చులకన అవ్వటం, జగన్ మీద వ్యతిరేకత వీళ్ళ మీద కూడా పడటంతో, భవిషత్తు ఏంటి అనేది అర్ధంకాక తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా, జగన్ ను నమ్మి, రాజకీయ ప్రతిష్టను చేజేతులారా నాశనం చేసుకుని, అవమానం పాలయ్యామని బాధ పడుతున్నారు శిల్పా సోదరులు.