నిన్న నంద్యాల, నేడు కాకినాడ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీకే జై కొట్టారు. తిరుగులేని విజ‌యాన్ని అందించారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌ కోసం ముద్ర‌గ‌డ‌ ప‌ద్మ‌నాభం చేస్తున్న ఉద్య‌మం ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని 'నంద్యాల' అసెంబ్లీ, 'కాకినాడ' కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు ను దెబ్బ కొట్టాలని ఎన్నో కుట్రలు చేసినా అవేమి ఫలించలేదు. కాపు రిజ‌ర్వేష‌న్ల ముసుగులో ముద్ర‌గ‌డ రాష్ర్టంలో ప్ర‌భుత్వాన్ని ఢీ కొడుతున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కాపులు బుద్ది చెబుతారంటూ హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లే స‌మ‌యం వ‌చ్చింది.

తొలుత నంద్యాల ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో టీడీపికి వ్య‌తిరేకంగా బ‌లిజ‌లు ఓటు వేయాల‌ని సంకేతాలు పంపారు. అయినా 36వేల‌మంది బ‌లిజ‌లు ఒకే తాటిపైకి వ‌చ్చారు. టీడీపీ ప‌క్షాన నిలిచారు. కాకినాడ ఎన్నిక‌ల్లో కాపు ఉద్య‌మ ప్ర‌భావం ఉంటుంద‌ని భావించారు. అయితే అది ఎక్క‌డా ప్ర‌తిఫ‌లించ‌లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మొత్తం 48 డివిజ‌న్ల‌కు గాను 38 చోట్ల టీడీపీ, బీజేపీ కూటమి ప‌క్షానే నిలిచారు.

వాస్త‌వానికి ముద్ర‌గ‌డ ఉద్య‌మం వెనుక వైసీపీ ఉంద‌ని ఎప్ప‌టి నుంచో టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ కూడా ముద్ర‌గ‌డ ఉద్య‌మం త‌మ‌కు లాభిస్తుంద‌ని ఊహిస్తూ వ‌చ్చింది. అయితే ఆ అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందుల‌య్యాయి. నంద్యాల ఉప ఎన్నిక‌లు , కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఆ పార్టీకి షాక్ ఇచ్చాయి. అక్క‌డ బ‌లిజ‌లు, ఇక్క‌డ కాపులు వైసీపీని ఆద‌రించ‌లేదు. కాకినాడ‌లో అయితే 30 ఏళ్ల త‌ర్వాత టీడీపీకి ప‌ట్టం గ‌ట్టారు.

ఇక ముద్రగడ కాపులకు నాయకుడు కాదు అని కాకినాడ ఎన్నిక రుజువుచేసింది. తొంభై శాతంమంది కాపులు తెలుగుదేశం వెంటే ఉన్నారు అని, ముద్రగడ కేవలం కాగితం పులి మాత్రమే అని ఈ ఎన్నిక చాటింది.

తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు లాంటి అత్యున్నత పదవులు తమ సామాజికవర్గానికి ఇచ్చి, కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయాలు కేటాయించి తమ కులం వారి అభ్యున్నతికి పాటుపడుతున్నా, కాపులను బిసిల్లో చేర్చే విషయంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసినా ముద్రగడ ఇవేమి పట్టించుకోకుండా కేవలం జగన్ తొత్తుగా మారి కాపులను టిడిపికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టటం తన పబ్బం గడుపుకోవటం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టటమే అని భావించారు. దీని ఫలితమే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం, వైసిపి ఘోర పరాజయం.

నిజానికి జగన్ తో స్నేహం కంటే ముందు ముద్రగడకు కాపు కులంలో మంచి పేరే ఉంది... తుని ట్రైన్ సంఘటన మొదలు, ఇవాల్టి వరకు, ముద్రగడ అడుగడుగునా జగన్ కు ఎలా వంత పాడారో చూసి, సొంత కులం వాళ్ళే ముద్రగడను లైట్ తీసుకున్నారు. మొన్న నంద్యాలలో శిల్పా సోదరులు రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన జగన్, ఇవాళ ముద్రగడకు కూడా అదే పరిస్థితి తీసుకు వచ్చారు...

ఇప్పటికైనా ముద్రగడ తన క్షుద్ర రాజకీయాన్ని మానుకుని తన కుటిల రాజకీయ చదరంగంలో కాపులను పావులుగా మార్చకుండా చూడాలని మెజారిటీ కాపులు తమ తీర్పును ఓట్ల రూపంలో తెలియచేశారు. ఈ తీర్పు కాపుల విజయం, ముద్రగడ పరాజయం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read