జగన్ మోహన్ రెడ్డికి మొదటి నుంచి అమరావతి అంటే ద్వేషం ఉన్న సంగతి అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగానే, అమరావతి పై విషం చిమ్మించే వాడు. తరువాత అధికారంలోకి వచ్చాక, అమరావతిని మూడు ముక్కలు చేసి, చివరకు అమరావతిని నిజంగానే స్మశానం చేసాడు. ఎక్కడి కట్టడాలు అక్కడ ఆగిపోయాయి. ప్రజలు ఉద్యమ బాట పట్టారు. రెండేళ్లుగా అక్కడ అమరావతి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు 700 రోజుల పైన, ఈ ఉద్యమం సాగింది. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా, జగన్ మోహన్ రెడ్డి వారితో చర్చించలేదు. చర్చించక పొగా, వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని, ఒక కులం వారని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక నిందలు వేసారు. అమరావతి ఒక కులం కాదని నిరూపించారు. తరువాత వారు చేసిన అనేక ఆరోపణలకు సమాధానం చెప్పారు. చివరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే డ్రామా మొదలు పెట్టగా, అది కూడా ఏమి లేదని సుప్రీం కోర్టు కూడా తేల్చింది. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, అమరావతి పై ప్రజల్లో ఎలా ద్వేషం నింపాలి అనే, మరో పక్క ఆలోచన ఏమి పుట్టలేదు. ఈ నేపధ్యంలోనే అమరావతి రైతులు, న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలు పెట్టారు. కట్ చేస్తే, ఈ రోజు అమరావతి మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకుంటున్నా అని ప్రకటించారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి లాంటి మొండి మనస్తత్వం ఉన్న వ్యక్తి అమరావతి పై వెనక్కు తగ్గుతూ నిర్ణయం తీసుకోవటం అనే మామూలు విషయం కాదు. మళ్ళీ బిల్లు పెడతాం అని చెప్తున్నా, అది జరిగే పని కాదు. కేవలం ఓటమని ఒప్పుకోలేక జగన్ రెడ్డి ఆడిన ఒక కవర్ డ్రైవ్. అసలు జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, హైకోర్టులో కేసు విచారణ వేగంగా సాగుతుంది. హైకోర్ట్ ధోరణి చూస్తుంటే, ఈ నెలలోనే జడ్జిమెంట్ ఇచ్చే అవకాసం ఉంది. ఎలాగూ తమకు వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి, దాన్ని నుంచి తప్పించుకుంటానికి, కాలయాపన చేయటం కోసం, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండో కారణం, గత వారం అమిత్ షా, అమరావతి పై పీకిన క్లాస్ విషయంలో, కేంద్రం నిర్ణయం ఏమిటో అర్ధమైంది. ఇక మూడోది అమరావతి రైతులకు వస్తున్న స్పందన. నెల్లూరు జిల్లాలో కూడా రైతులకు, ప్రజలు స్వచ్చందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇంకా ఇంకా ప్రజల్లో చులకన అవ్వటం ఇష్టం లేక, ఈ మూడు కారణాలతో జగన్, ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్వెల్ కాదని, జగన్ లాంటి మొండి వ్యక్తి ఇలా నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఇది క్లైమాక్సా అని అంటున్నారు.