ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో... మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అయినా, ప్రజల పక్షాన నిలబడేది, కలబడేది ప్రతిపక్షం... అధికార పక్షం చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ, ప్రజల మద్దతు పొంది, వారి కోసం పోరాడతారు... ఇది సహజంగా ఎక్కడైనా జరిగేది... మన దేశానికి వద్దాం.... కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది... రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది... అక్కడా, ఇక్కడే ఒకే ప్రభుత్వం ఉంటే, సహజంగా ఎక్కువ పోరాడలేరు... ఇలాంటి టైంలోనే ప్రతిపక్షం, అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని నిలదీస్తుంది... మన ఖర్మకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం, ఎక్కడ ఉందో తెలియదు...
కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అంటూ, మిత్రపక్షం అయినా సరే, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పై విమర్శలు చేస్తూ, వారు చేస్తున్న పనులను బహిరంగంగా ఎండగడుతుంది... పార్లమెంట్ లో ఆందోళన చేస్తుంది.. కాని, వీరి కంటే , దూకుడుగా ఉండాల్సిన జగన్ పార్టీ మాత్రం, అడ్రస్ లేదు... వారి ఎంపీలు ఎక్కడ ఉన్నారో తెలీదు... ఇప్పటి వరకు, ఒక్కరు కూడా మన రాష్ట్రానికి, కేంద్రం అన్యాయం చేస్తుంది అని చెప్పలేదు.... పాదయాత్ర అంటూ ప్రజల్లోనే ఉంటున్న జగన్, అన్ని విషయాలు చెప్తున్నాడు కాని, బడ్జెట్ పై మాత్రం మాట మాట్లాడటం లేదు...
ఇదే విషయం పై, జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....కేంద్ర బడ్జెట్‌ను అధికార పార్టీ నేతలతో పాటు అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..జగన్ మాత్రం తన వైఖరి చెప్పకపోవడం బాధాకరమంటూ విమర్శలు వస్తున్నాయి... సీపీఐ బంద్‌కు పిలుపు ఇస్తే మాత్రం..మద్దతు ఇస్తున్నారన్నారు. బంద్‌కు పిలుపు ఇవ్వాల్సిన వారే మద్దతు ఇస్తున్నారంటే..వైసీపీ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుంది... జగన్ లీడర్ కాదని, ఫాలోవర్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.... కేసుల మాఫీ గురించి ఆలోచించాలా? ప్రజలు గురించి ఆలోచించాలో జగన్ తేల్చుకోలేకపోతున్నారని ప్రజలు అంటున్నారు...