నిన్న కామెడీ చానల్స్ TRP రేటింగ్స్ అన్నీ దాటుకుంటూ, సాక్షి టీవీలో జగన్, కొమ్మినేని ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయ్యింది.. ఆయన అడగటం, ఈయన ముసి ముసి నవ్వులు నవ్వటం... అయినా సొంత ఛానల్ లో పని చేస్తున్న వ్యక్తి చేత ఈయన ప్రశ్నలు అడిగించుకోవటం, దానికి ఈయన గొప్పగా సమాధానం చెప్పటం... దీనికి సాక్షి స్పెషల్ ఎఫెక్ట్స అదనం... నా అంత నిజాయితీ పరుడు ఈ తెలుగు గడ్డ మీదే పుట్టలేదు అని చెప్పాడు జగన్... ఇన్ని కబుర్లు చెప్పి, జగన్ ఇవాళ పాదయాత్ర ఆపి హైదరాబాద్ బయలుదేరాడు... గార్లదిన్నె మండలం బాపినేపాళ్యంలో...పాదయాత్ర ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు.
అక్రమాస్తుల కేసులో, రేపు సీబీఐ కోర్టుకు జగన్ హాజరుకానున్నారు... ఆయన 11 కేసుల్లో A1... బెయిల్ మీద షరతులతో బయట తిరుగుతున్నాడు... ఇప్పటికే సిబిఐ 43 వేల కోట్లు అవినీతి సొమ్ము నోక్కేసాడు అని కోర్ట్ కి చెప్పింది... ఈయన నాన్న ముఖ్యమంత్రి అవ్వక ముందు, ఆస్తలు అమ్ముకుని బ్రతికిన చరిత్ర నుంచి, ఇప్పుడు బంగాళాలు, ప్యాలస్ లు, ఎస్టేట్ లు, కంపెనీలు... మరి ఇవన్నీ ఎలా సంపాదించారు అని నిన్న కొమ్మినేని ఆ కామెడీ ఇంటర్వ్యూ లో అడిగి ఉంటే ప్రజలకు కొంచెం క్లారిటీ వచ్చేది...యువత కూడా, ఈయన ఎంత గొప్ప మేధో సంపత్త ఉన్నవాడో తెలుసుకుని, ఆ కిటుకులు వీళ్ళు కూడా వాడి, లక్ష కోట్లు సంపాదించుకునేవారు...
అయినా, కొమ్మినేని గారు అవినీతి మీద ప్రశ్నలు అడిగితే, నేను నిజాయితీ పరుడుని, చంద్రబాబు నన్ను ఇరికించాడు... నేను పోరాడుతున్నాను అని చెప్పారు... అవినీతి పరులుని జైలుకి పంపిస్తాను, నా కసి అది అని అన్నారు.. చివరకి పాదయాత్ర ఆపేసి, అవినీతి కేసుల్లో విచారణకు హాజరు కావటానికి, శుక్రవారం సులువు పెట్టి, హైదరాబాద్ వెళ్లారు... ఇలాంటి నాయకులు అవినీతి గురించి మాట్లాడటం, ఇలాంటి వాళ్ళని ఆ కొమ్మినేని ప్రశ్నలు అడగటం, సరిపోయింది...