అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని పీకేసి విశాఖ‌లో దుకాణం తెర‌వాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆయ‌న ప్ర‌భుత్వం ఎంత తొంద‌ర ప‌డుతోందో, సుప్రీంకోర్టులో అంత ఆలస్యం అవుతోంది. రేపు విశాఖ రాజ‌ధాని త‌ర‌లింపు, ఎల్లుండి త‌ర‌లిస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోన్న వైసీపీ పెద్ద‌ల‌కు అమ‌రావ‌తి రాజ‌ధానిపై దాఖ‌లైన కేసుల విచార‌ణ‌ని జూలై 11న విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు ప్ర‌క‌టించ‌డంతో ఏపీ స‌ర్కారు షాక్ త‌గిలింది. త్వ‌ర‌గా అమరావతి రాజధాని కేసుల‌ను విచారించాల‌ని సుప్రీంకోర్టులో మరోసారి  ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు లేవ‌నెత్తారు. కేసు విచారణ జులై 11న చేపడతామని , అంతకు ముందు సాధ్యం కాదని  ధర్మాసనం తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని మరోసారి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోర‌గా స్టే ఇచ్చేందుకు  న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం నిరాక‌రించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని, వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమ‌తి కోర‌గా ధర్మాసనం అంగీక‌రించింది. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా జ‌గ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానంలో అనూహ్యంగా బ్రేక్ ప‌డింది. త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని ఏర్పాట్లు చేసుకున్న ప్ర‌తీసారి ఏదో ఒక అవాంత‌రం ఏర్ప‌డుతూనే ఉంది. తాజాగా త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ‌కి నో చెప్పిన ధ‌ర్మాస‌నం, హైకోర్టు తీర్పుపై స్టేకి నిరాకరించ‌డం జ‌గ‌న్ రెడ్డికి పెద్ద దెబ్బే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read