ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తాడేపల్లి ఇంటి నుంచి అప్పుడప్పుడు బయటకొస్తున్నారు. ముందుగా ప్లాన్ చేసే సభలైనా, జనాల్ని తరలిస్తున్నా, వారు పారిపోతున్నారు. ఇదే సమయంలో గత రెండు నెలలుగా ప్రజల్లో తిరుగుతున్న చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతం ఏదైనా చంద్రబాబు వస్తున్నారంటే జనప్రభంజనమే. అర్ధరాత్రి అయినా, వాన పడుతున్నా జనంలో ఒక్కరు కూడా బాబు సభ పూర్తయ్యేవరకూ కదలడంలేదు. ఇంత మార్పు ప్రజల్లో ఎందుకు వచ్చింది అనేది జగన్ మోహన్ రెడ్డికి అంతుచిక్కడంలేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం అదే సమయంలో చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతుండడంపై అందిన ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా జగన్ ఆందోళనకి కారణం అవుతున్నాయి.
నేరుగా లబ్దిదారులకే పధకాల డబ్బులు ఇస్తున్నాం, పథకాల బటన్ అనుకున్న సమయానికే నొక్కుతున్నాం, చంద్రబాబు సభలకు వెళ్తే పధకాలు కట్ చేస్తాం అని బెదిరిస్తున్నాం, అయినా జనం చంద్రబాబు సభలకు వస్తూనే ఉన్నారు. ఒక్కో పర్యటనకి జనాదరణ పెరుగుతుందే తప్పా తరగడంలేదు. దీని వెనక మర్మమేంటో తనకు తెలియాలని జగన్ రెడ్డి ఐప్యాక్ టీముని సర్వే చేసి ఇవ్వాలని కోరారు. వైసీపీపై వ్యతిరేకత ఎందుకు వస్తుంది ?ప్రజలు చంద్రబాబు వైపు ఎందుకు చూస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటు వేస్తారంటూ వివిధ ప్రశ్నలతో పార్టీ కేడర్ నుంచి, ప్రజల నుంచి ఫోన్ చేసి అభిప్రాయసేకరణ చేస్తున్నారు ఐప్యాక్ టీమ్.