వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి పూర్తిగా మారిపోయింది. మొన్న‌టివ‌ర‌కూ ఆత్మ‌విశ్వాసానికి అడ్ర‌స్‌లా క‌నిపించేవాడు. ఎన్నిక‌ల యుద్ధంలో గెలుపులు వ‌చ్చి వాలుతుంటే త‌న‌కి ఎదురే లేద‌ని ఫిక్స్ అయిపోయాడు. త‌న బొమ్మ కనిపిస్తే గెలుపు ఖాయ‌మ‌నే రేంజుకి చేరాడు. ఈ స్థితిలో మూడు ప్రాంతాల్లో మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను చేజిక్కించుకున్న టిడిపి ప‌ట్ట‌భ‌ద్రులు తొలి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఓట‌మి కార‌ణాలు స‌మీక్షించుకునే ఆలోచ‌నే లేని జ‌గ‌న్ రెడ్డి త‌న చుట్టూ ఉన్న‌వారిని అనుమానించ‌డం మొద‌లు  పెట్టారు. త‌న‌ది కాని సీటు కోసం కొనుగోలు చేసిన న‌లుగురు టిడిపి వాళ్ల‌ని న‌మ్ముకుని ఏడు సీట్ల‌కి పోటీకి దింపారు. ఇక్క‌డే తెలుగుదేశం చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌భుత్వ తీరుని ప్ర‌శ్నిస్తున్నార‌నే కార‌ణంతో చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌లో స‌మ‌న్వ‌య‌క‌ర్త పేరుతో క‌క్ష సాధింపుల‌కు దిగారు జ‌గ‌న్ రెడ్డి. దీంతో వాళ్లంతా పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేస్తార‌ని డౌట్ ప‌డిన జ‌గ‌న్ పై టిడిపి మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. టిడిపితో ట‌చ్‌లో 16 మంది ఉన్నార‌ని లీకులిచ్చారు. దీంతో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో ప‌డ్డారు. మ‌రోవైపు ఏ ఎమ్మెల్యేనీ న‌మ్మ‌ని జ‌గ‌న్ అందరిపైనా నిఘా వేయించాడు. చివ‌రికి త‌న‌కి అత్యంత  న‌మ్మ‌క‌స్తుల‌నీ న‌మ్మ‌డంలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి న‌లుగురిని స‌స్పెండ్ చేసినా, టికెట్ ఇచ్చేది లేద‌ని తేల్చేసిన మ‌రో 40 మంది వ‌ర‌కూ ఎమ్మెల్యేలు హ్యాండిచ్చే అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ రెడ్డి అనుమానిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో న‌లుగురే క్రాస్  ఓటింగ్‌కి చేశార‌ని భావిస్తున్న న‌ల‌భై మందిపై జ‌గ‌న్ రెడ్డి డౌట్ ప‌డుతున్నార‌ని వైసీపీలో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read