కాలం మారింది.. ఆధ్యాత్మికత భోదించే సన్యాసులు, రాజకీయాలు మాట్లాడుతూ, తమకు ఇష్టం లేని రాజకీయ నాయకుల పై కక్ష తీర్చుకునే కాలం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఒక సన్యాసి సేవలో , ఇద్దరు సియంలు ఉన్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎవరు ఏమైనా చేసుకోవచ్చు కాని, సమాజానికి మంచి చెప్పి, మంచి మార్గంలో సమాజం పయనించే కార్యక్రమం చెయ్యాల్సిన స్వామీజీలు, బహిరంగంగా ఒక పార్టీని, వ్యక్తిని పొగుడుతూ, మరో పార్టీని, నాయకుడిని గేలి చేస్తున్నారు అంటే, నేటి సమాజం ఎటు వైపు పోతుందో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, నిన్న కృష్ణా తీరంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఒక స్వమజీ ఇలా కూడా మాట్లాడతారా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. సోమవారం ఉండవల్లిలో, కృష్ణా తీరంలో జరిగిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామి సన్యాస దీక్ష కార్యక్రమంలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వీరిని స్వరూపానంద ఆశీర్వదించారు.

జగన్‌, కేసీఆర్‌లను స్వరూపానంద ప్రశంసలతో ముంచెత్తారు. వీరు తనకు అత్యంత ప్రాణమని తెలిపారు. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ నాకు అత్యంత ప్రాణప్రదమైనవారు. జగన్ నాకు ఆత్మ, కేసీఆర్ నాకు ప్రాణ సమానం. ఎన్నికల ఫలితాలు రాక ముందే, ముఖ్యమంత్రి జగన్‌ అని ఆహ్వాన పత్రికల్లో ముద్రించి, పంచి పెట్టాం. భవిషత్తును తెలియచేసే పీఠం, మా విశాఖ శారదా పీఠం మాత్రమే. అధర్మం ఓడిపోతుంది,ధర్మం గెలుస్తుంది,అందుకు నిదర్శనమే, నేడు మహారాజులుగా నిలిచిన వైఎస్‌ జగన్‌ నిదర్శనం. అగ్ని సాక్షిగా నేను చెబుతున్నాను. నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌. ఆయనంటే నాకు పరమ ప్రాణం. ఆయన కోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు అహర్నిశలు కష్టపడింది. ఇటు జగన్‌, అటు కేసీఆర్‌ రెండు రాష్ట్రాలను 15 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాలని, దీని కోసం విశాఖ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది" అని స్వరుపానంద అన్నారు. ఒక రాజకీయ పార్టీ కోసం, ఇలా ఒక సన్యాసి మాట్లాడటం చూసి ప్రజలు అవాక్కయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read