స్వామి స్వరూపానంద, ఒకప్పుడు స్పోర్ట్స్ గూడ్స్ షాప్ నడిపిన ఈయన ఇప్పుడు పీఠం అధిపతి. ఈయన ఆధ్వర్యం లో ఇప్పుడు ఎన్నో ఆలయాలు నడుస్తున్నాయి. రాష్ట్రం లో అత్యంత అవినీతిపరులైన కాంట్రాక్టర్ గా జనం చెప్పుకునే వ్యక్తి ఈయనకి ఆత్మీయ శిష్యుడు. ఎంతోమంది మంచివాళ్ళు కూడా ఈయనకి శిష్యులు గా ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లో ఈయన ఎప్పుడూ ముందుంటారు. ఆవిధంగా ఆయనకి ప్రచారం కూడా బాగానే వస్తుందనుకోండి. ఈయన శిష్యబృందం లోకి అక్రమాస్తులకేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ చేరాడు. చలా రోజులు నుంచి ఈ స్వామి వారి సేవలో జగన్ తరిస్తున్నాడు...
అయితే ఇప్పుడు స్వామి వారికి ప్రవచనాలు చెప్పి చెప్పి బోర్ కొట్టిందో ఏమో కాని, స్వామి వారి మనసు రాజకీయాల వైపు మళ్ళింది... ఎలా అయినా ఈ సారి ఎంపి అవ్వాలని కోరిక అట... అందుకే ఇప్పటి నుంచే జగన్ ను ప్రసన్నం చేసుకునే క్రమంలో, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు స్వామీజీ... స్వామి వారు మనసు వైజాగ్ మీద ఉంది అంట... దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ కార్పోరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా, స్వరూపానంద మాత్రం బ్రాహ్మణులకి అన్యాయం జరుగుతోంది అనే మాట్లాడుతున్నారు. బ్రాహ్మణులకి జరుగుతున్న అన్యాయాలపై ఈయన త్వరలో విజయవాడ లో ఒక సభ పెడతామని చెబుతున్నారు. కాని స్వామి వారికి జగన్ తిరుమలలో చేస్తున్న అరాచకం మాత్రం ఎప్పుడూ కనిపించదు... పైగా తిరుమలలో ఒక సెట్ అప్ సెట్ చేశారు... జగన్ తిరుమల దర్శనం అవ్వగానే, బయట ఈ స్వామి వారు ఉండేలా సీన్ సెట్ చేసారు...
వైఎస్ జగన్ తన మీద ఉన్న క్రిష్టియన్ అనే ముద్ర తొలగించుకోవడానికి స్వరూపానంద ఆధ్వర్యంలో అనేక పూజలు, యజ్ఞాలు చేస్తున్నారు. బైబిల్ చేతపట్టుకుని విజయమ్మ చేసిన ఎన్నికల ప్రచారం, బ్రదర్ అనిల్ క్రిస్టియన్ ఓటర్లతో మీటింగ్ లు అన్ని కలిసి 2014 లో బాగా దెబ్బతీసాయని నమ్ముతున్న జగన్ ఎన్నికల తర్వాత ప్లేటు మార్చాడు. అంతకు ముందు ఎన్నడూ స్వామీజీలని దర్శించుకొని జగన్ ఎన్నికల్లో ఓడిపోగానే స్వామి స్వరూపానంద శిష్యుడిగా మారిపోయాడు. ఏ స్వామి కళలు మొక్కుతాడు అనేది జగన్ వ్యక్తిగత విషయం. ఎవర్ని శిష్యులుగా చేర్చుకోవాలనేది స్వరూపపానంద వ్యక్తిగత విషయం. అయితే ఇప్పుడు వైజాగ్ ఎంపిగా స్వామి వారు పోటీ చెయ్యాలి అనుకోవటంతో జగన్ ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్తున్నారు... వైజాగ్ ఎంపి సీట్ ఇప్పటికే ఐవైఆర్ కృష్ణారావుకి ఇవ్వటానికి జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారు అంట... మరి ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ ఎవరకి ఇస్తారో చూడాలి...