జగన్ కు ఇప్పటికే సినిమా పూర్తిగా అర్ధమైపోయింది... ఒక పక్క పవన్ ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తున్నాడు... మరో పక్క తెలుగుదేశం కాపు రిజర్వేషన్ అని, కాపు కార్పొరేషన్ అని ఇలా అనేక విధాలుగా కాపులకు న్యాయం చేస్తుంది... కాపు సామాజికవర్గం ఓట్లు కోసం ఇన్నాళ్ళు పవన్ జోలికి వెళ్ళకుండా ఉన్నాడు జగన్... కాని పవన్, జగన్ ని ఎక్కువ టార్గెట్ చెయ్యటం సహించలేకపోతున్నాడు జగన్... ఎలాగూ కాపు ఓట్లు పవన్, తెలుగుదేశం పార్టీలకు మాత్రమే పడతాయి అని తెలుసుకున్న జగన్, కాపు సామాజికవర్గం మీద ఆశలు వదులుకున్నాడు... అందుకే ఇక పవన్ ని టార్గెట్ చెయ్యనున్నాడు..
ఆ కోవలోనే ముందుగా తన అనుకూలుడు అయిన ముద్రగడ చేత పవన్ ని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టాడు... దీంతో నిన్న ముద్రగడ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అసలు పవన్ కణ్యాణ్ ఎవరో తనకు తెలియదని ముద్రగడ అన్నారు... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాపునేత ముద్రగడ పద్మనాభం పర్యటించారు. వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదన్నారు. అతనెవరో నాకు పరిచయంలేదని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది... ముద్రగడ పవన్ లాంటి వారితో కలుపుకుని తను కోరుకుంటుంది సాధించాలి.. కాని ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది... నిజానికి పవన్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు మాత్రమే ఇబ్బంది... ముద్రగడ పవన్ మీద విమర్శలు చెయ్యాల్సిన పని లేదు... ముద్రగడ జగన్ డైరెక్షన్ లో నడుస్తున్నాడు అనటానికి ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ... మరి దీని మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఎందుకు అంటే, మొన్న ఒక తెలుగుదేశం మంత్రి ఇలాగే పవన్ ఎవరో తెలీదు అంటే, దీని పై ట్విట్టర్ లో స్పందించిన పవన్, "నేను తెలీదా... సంతోషం" అని ట్వీట్ చేసారు... మరి అదే వ్యాఖ్యలు చేసిన ముద్రగడ పై ఎలా స్పందిస్తారో ? లేక ఇది జగన్ స్కెచ్ అని తెలుసుకుని మానంగా ఉంటారో చూడాలి...