జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఇప్పటికే ఆయన పై 12 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులు పై నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీటి పై తెలంగాణా హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖులు అయ్యింది. మొత్తం అన్ని కేసులు కలిపి, దాదాపుగా 40 పిటీషన్లకు సంబంధించి, తెలంగాణా హైకోర్టు రోజు వారీ విచారణ చేయాలి అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిట్ పిటీషన్లకు సంబంధించి కానీ, డిశ్చార్జ్ పిటీషన్లకు సంబంధించి కానీ, పిటీషన్లు విచారణలో జాప్యం జరుగుతూ వస్తుంది. కొన్ని పిటీషన్లలో సిబిఐ కానీ, ఈడీ కానీ కౌంటర్ దాఖలు చేయటానికి గడువు కోరుతూ ఉండటంతో, తీవ్ర జాప్యం జరుగుతుంది. సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖాలు చేస్తే కానీ, డిశ్చార్జ్ పిటీషన్ల పై క్లారిటీ వచ్చే అవకాసం లేదు. మరో వైపు తెలంగాణా హైకోర్టులో దాఖలు అయిన రిట్ పిటీషన్ల విషయంలో మాత్రం, ఇక నుంచి రోజు వారీ విచారణ జరిగి, వీటిని తొందరగా తేల్చేస్తాం అంటూ, తెలంగాణా హైకోర్టు భారీ జర్క్ ఇచ్చింది. ఈ కేసులు సాగదీసి సాగదీసి, టైం వెస్ట్ చేయాలి అనే స్ట్రాటజీని పసిగట్టిన తెలంగాణా హైకోర్టు, ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 40కు పైగా ఈ తరహా పిటీషన్ల పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ 40కు పైగా పిటీషన్ల పై నిర్ణయం తీసుకుంటూ రోజు వారీ విచారణ చేసి, తొందరగా తేల్చి వేయాలని హైకోర్టు భావిస్తుంది. ప్రధానంగా ఈ కేసుల్లో, హెటిరో, అరబిందో, రాంకీ ఇలా వివిధ సంస్థల విషయంలో సిబిఐ అధికారులు సుదీర్ఘ విచారణ చేసి, దానికి సంబంధించిన చార్జ్ షీట్లు వేసారు. దీని ఆధారంగానే సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే టమా పేర్లు తీసి వేయాలని, పిటీషన్లు వేస్తూ, కాలం సాగ దీస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి సియం అయిన తరువాత, కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరు అయ్యారు. ఇప్పుడు హైకోర్టులో మొదలు అయ్యే రోజు వారీ విచారణకు హైకోర్టు వ్యక్తిగతంగా జగన్ను రమ్మంటుందా, లేదా అనేది చూడాలి. ఈ రోజు నుంచి ప్రతి రోజు ఈ కేసులు విచారణ జరగనుంది. అయితే ఒక వారం గడువు కావాలని పిటీషనర్ తరుపున న్యాయవాదులు కోరగా, కోర్టు ఒప్పుకోలేదు. ఇప్పటికే ఏళ్ళ తరబడి ఆలస్యం అయ్యిందని, ఇక విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అంటూ, కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేసుని సాధ్యమైనంత ఎక్కువ సేపు సాగదీయాలి అనే పిటీషనర్ తరుపు ఎత్తుగడ వర్క్ అవుట్ అవ్వలేదని చెప్పాలి.