రేపు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇంత అర్జెంట్ గా జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనే చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రధాన మంత్రి, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ని జగన్ మోహన్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత కొన్ని నెలలుగా, పరిష్కారం కాని రెండు రాష్ట్రాల జల వివాదాల పై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అనేక సార్లు రెండు రాష్ట్రాలు కూర్చుని చర్చించినా, ఎలాంటి ఉపయోగం లేకపోవటంతో, ఇవి కొలిక్కి రావటం లేదని, అందుకే ఈ విషయాల పై జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీ దగ్గరే తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని, ఇందులో భాగంగానే ప్రధాని మోడి అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా విభజన హామీలు ఇప్పటి వరకు పరిష్కారం కానివి చాలా ఉన్నాయని, దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పెండింగ్ బకాయలతో పాటుగా, సవరించిన అంచనాలు ఇంకా ఆమోదించక పోవటం పైన కూడా చర్చిస్తారని, వీటికి పరిష్కారం తీసుకొచ్చే విధంగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేసారని, ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు లీక్ లు ఇస్తున్నాయి. ఈ అంశాలు అన్నిటితో పాటుగా, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల పై కూడా వివరించటానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే అవకాసం ఉంది.
ముఖ్యంగా గత కొంత కాలంగా, బీజేపీ విపరీతంగా వైసిపీని టార్గెట్ చేయటం, అలాగే విజయవాడ మీటింగ్ పెట్టి, త్వరలోనే ఇక్కడ బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళ్తున్నారని చెప్పటం కూడా జగన్ మోహన్ రెడ్డిలో ఒక విధమైన భయం పట్టుకుందని, అందుకే ఢిల్లీకి వెళ్తున్నారు అంటూ, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బీజేపీ దూకుడుతో, వైసిపీ ఇబ్బంది పడుతుంది. అయితే బీజేపీలో,కొంత మంది వైసీపీ కోవర్ట్ లు ఉండటంతో, వైసీపీకి బీజేపీని మ్యానేజ్ చేయటం తేలిక అవుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో అమిత్ షా వచ్చి క్లాస్ పీకటంతో, మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి, బీజేపీ ఆక్టివ్ అయ్యింది. జగన్ కు వ్యతిరేకంగా ఉండే బ్యాచ్ కు, ప్రాధాన్యత పెరిగింది. విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, దాదాపుగా సైలెంట్ అయిపోయారు. విజయవాడ మీటింగ్ లో బెయిల్ పై ఉన్న నేతలు జైలుకు వెళ్తారని, ఏకంగా కేంద్ర మంత్రి చెప్పటంతో, నాలుగు రోజుల తరువాత, జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం, ఇవన్నీ చూస్తూనే, ఏదో జరగబోతుందని అర్ధం అవుతుంది.