జగన్ మోహన్ రెడ్డి సోమవారం, ఢిల్లీ వెళ్తున్నారు అంటూ మీడియాకు సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడున్న క-రో-నా పరిస్థితిలో అంత హుటాహుటిన ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరికిన వెంటనే ఆయన సోమవారం ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే కేవలం వ్యాక్సిన్ ల విషయంలో, కేంద్రంతో చర్చించటానికి ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నా, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వరుస వివాదాల నేపధ్యంలోనే, ఆయన ఢిల్లీ వెళ్తున్నారని, కేంద్రానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలో భాగంగానే, ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీ పై థ-ర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ, దేశ వ్యాప్తంగా చర్చ జరగటం, వివిధ రాష్ట్రాల ఎంపీల నుంచి రఘురామరాజుకు మద్దతు లభ్దిస్తూ ఉండటంతో, అసలు రఘురామరాజు ఎపిసోడ్ మొత్తం పైన,కేంద్రానికి సంజాయిషీ ఇచ్చుకునే పనిలోనే, ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు వస్తున్న సమాచారం. ఇప్పటికే రఘురామరాజు ఢిల్లీలో వివిధ రాజ్యాంగ సంస్థలకు కూడా ఆయన ఫిర్యాదు చేసి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది.
దీని పై సిబిఐ స్పందిస్తూ, ఏది మంచిది అయితే అది, మీరే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి అంటూ, బాల్ ని సిబిఐ కోర్టులోకే నెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీలో రోజు రోజుకీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటూ ఉండటంతో పాటుగా, వరుస వివాదులు చుట్టూ ముడుతూ ఉండటంతో, డ్యా-మే-జ్ కంట్రోల్ లో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి, అక్కడ ప్రభుత్వ పెద్దలను కలిసి, సమాధానం చెప్తారని తెలుస్తుంది. దీని కోసమే, ఇప్పటికే కేంద్రం హోం శాఖా మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ అడిగారని, ఆయన అప్పాయింట్మెంట్ వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి, రెండు రోజులు క్రితం వ్యాక్సిన్ లకు సంబంధించి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగా, ఒకే మాట మీద ఉండి, కేంద్రం పై ఒత్తిడి తేవాలని లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దీని పై కూడా ఆయన ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందో కూడా, వివరణ ఇచ్చే అవకాసం ఉంది. మొత్తం మీద, కేంద్రం వద్ద తమ పరపతి పడిపోకుండా, డ్యా-మే-జ్ కంట్రోల్ నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు.