జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత నుంచి, తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావటం లేదు అనే విమర్శలు ఉన్నాయి. అధికారం వచ్చే దాకా ఊరు ఊరు తిరిగి, అధికారం వచ్చిన తరువాత, అసలు బయటకు రావటమే మానేసారు. కేవలం పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే ఆయన బయటకు వచ్చిన సందర్భాలు అనేకం. మొత్తం ఆయన ఇంట్లో కూర్చుని బటన్ నొక్కటమే తప్ప, ప్రజలను కానీ, ఎమ్మెల్యేలను కానీ, పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ కలిసింది లేదు. జగన్ అపాయింట్మెంట్ దొరకాలి అంటేనే గగనం అయ్యే పరిస్థితి. ప్రజాప్రతినిధులకు కూడా ఆయన దొరకలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఏమి చేస్తారో కానీ, జగన్ ప్రవర్తన పై అటు ప్రజల్లో, ఇటు సొంత పార్టీ నేతల్లో కూడా అసహనం వచ్చేసింది. అయితే ప్రజల్లో వచ్చిన అసహనం, సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. ఇలా ఉంటే పూర్తిగా మునిగిపోతాం అని, ఇప్పటికే ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని, దీనికి తోడు కార్యకర్తలు కూడా అసహనంతో ఉన్నారని, ఇది మరింత పెరగకుండా చేయటానికి, జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం రోజు జరిగిన ఘటనతో జగన్ షాక్ తిన్నారు.

jagan 17032022 2

మార్చ్ 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అయితే తాడేపల్లి ఆఫీస్ లో కానీ, జిల్లాల్లో కానీ, ఎక్కడా వైసీపీ కార్యకర్త అనే వాడు రాలేదు. కేవలం నాయకులు హడావిడి చేసి వెళ్ళిపోయారు. కార్యకర్తలు అసలు పట్టించుకోలేదు. దీంతో కంగుతిన్న జగన్ మోహన్ రెడ్డి, దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. రెండు రోజుల పాటు పూర్తిగా కార్యకర్తలతో అందుబాటులో ఉండాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గురు, శుక్ర వారాల్లో, ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటారని, కలవాలి అనుకునే వాళ్ళు వచ్చి కలవచ్చు అంటూ, వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక నోట్ బయటకు వచ్చింది. కార్యకర్తలు వచ్చి కలవండి అంటూ మెసేజ్ లు వెళ్ళాయి. మొత్తానికి భవిష్యత్తు సినిమా జగన్ కు అర్ధం కావటం, వైసీపీ గ్రామాల్లో ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితి, ఇవన్నీ సంకేతాలుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి మూడేళ్ళ తరువాత, జగన్ మోహన్ రెడ్డి వాస్తవంలోకి వచ్చారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇవి ఎంత వరకు ఆ పార్టీ డామేజ్ కంట్రోల్ కు ఉపయోగ పడతాయో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read