విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని రేపు ప్రత్యేకంగా కలవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన జగన్ విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు జగన్ విశాఖ చేరుకొని స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను కలవలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
Advertisements