వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు.
శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది. దీని ప్రకారం, కేటీఆర్ సమక్షంలో అందరూ కలిసి సమావేశం అయ్యారు. టీఆర్ఎస్కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సింగిల్‌గా వస్తున్నారని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను బ్యానర్లపై ముద్రించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.
p style="text-align: justify;">వైఎస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైఎస్ అవినీతిపరుడని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.