జగన్ మోహన్ రెడ్డి పేరు, మారుమోగిపోతుంది... ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూ,అందరినీ ఆకట్టుకుంటున్నాడు... జగన్ అభిమానులు కూడా, ఎందుకు ట్రెండ్ అవుతున్నాడో తెలుసుకోకుండానే, మా అన్న ట్రెండ్ అవుతున్నాడు, ఇది మా అన్న కెపాసిటీ అని ప్రచారం చేసుకుంటున్నారు...
తీరా చుస్తే, అయ్యవారు ట్రెండ్ అవుతుంది, తనకు బాగా అచ్చు వచ్చిన కళకే... అదే అక్రమ ఆస్థులు... ఇవాళ, PMLA చట్టం ప్రకారం ఈడీ, నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన 148.89 కోట్ల విలువైన ఆస్థిని జప్తు చేసింది. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, విచ్చలవిడిగా అక్రమాస్థులు సంపాదించిన కేసులో, నిమ్మగడ్డ A12.
ఈ విషయం, ఈడీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో, అందరూ దాన్ని రీ-ట్వీట్ చెయ్యటంతో, జగన్ అన్న ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాడు... "నేను నడిచేది సన్మార్గంతో... మీరందరూ కూడా నా మార్గంలో నడవండి.." అన్న జగన్ మాటలు పట్టుకుని, జగన్ ఫాన్స్ కూడా, దీన్ని కూడా ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు.