ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వారు ఎవరూ, ఈ నిర్ణయం ఊరుకే తీసుకుని ఉండరు అంటూ అభిప్రాయ పడుతున్నారు. దీని వెనుక ఏదో స్కెచ్ ఉండే ఉంటుందని అంటున్నారు. తరువాత కొత్త బిల్లు వస్తుందని చెప్తున్నా, అది జరిగే పనిలా అనిపించటం లేదు. అయితే ఇప్పుడు మరో సంచలన విషయం బయట పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజధాని అభివృద్ధి పేరిట ఏకంగా రూ.50 వేల కోట్ల రుణాలకు టెండర్ పెట్టింది. గతంలో రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వద్దు అని చెప్పిన ప్రపంచ బ్యాంక్ వద్దకే ఏపి ప్రభుత్వం మళ్ళీ రుణం కోసం పరుగులు తీస్తుంది. ప్రధానంగా, ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించటంతో, ఏ రాజధాని అభివృద్ధి కోసం ఈ రూ.50 వేల కోట్ల రుణం తీసుకున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాజధాని రుణం పేరిట ఈ రూ.50 వేల కోట్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో ప్రపంచ బ్యాంక్ రుణాలను మంజూరు చేసేందుకు అప్పట్లో, అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది.

amaravati 24112021 2

అప్పట్లో వైసీపీకి చెందిన కొంత మంది ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసారు. అయితే ప్రపంచ బ్యాంక్ మాత్రం, అంతా సక్రమంగానే ఉన్నాయని, రుణం ఇస్తామని ముందుకు వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. మూడు రాజధానులకు వెళ్తున్నామని చెప్పి, అప్పట్లో ప్రపంచ బ్యాంక్ రుణం వద్దని చెప్పింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ రూ.50 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే మూడు రాజధానులు బిల్లు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ తో వ్యవహారం కాబట్టి, ఇంత పెద్ద మొత్తంలో రూ.50 వేల కోట్ల రుణం ఇవ్వాలి అంటే అంతా పక్కాగా ఉండాలి. అందుకే ఎలాగూ మూడు రాజధానులు కోర్టులో కొట్టేస్తారు కాబట్టి, ఆ బిల్లు వెనక్కు తీసుకుని, ఇప్పుడు అమరావతే రాజధానిగా చూపిస్తి, భారిగా రూ.50 వేల కోట్ల రుణం తీసుకునేందుకు, ప్రభుత్వం స్కెచ్ వేసినట్టు స్పష్టం అవుతుంది. మరి ఇది ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read