కేంద్రంలోనే బీజేపీ పెద్దలతో చెడిపోయిన సంబంధాలను, పునరుద్ధించే పనిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిమగ్నమయ్యారు. ఇందు కోసం, ఆయనే రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడు పర్యయాలుగా, ఆయనకు ఢిల్లీ పెద్దలతో అపాయింట్మెంట్ లేకపోవటంతో, ఇది విజయసాయి రెడ్డి చేతకాని తనంగా జగన్ భావిస్తున్నారని, అందుకే ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి, కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో, విభజన చట్టంలోనే అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎక్కడవి అక్కడ పెండింగ్ లో ఉండటం, రాష్ట్రంలో ఆదాయం పడిపోవటం, కేవలం సంక్షేమ పధకాలకే డబ్బు అంతా వెళ్ళిపోతూ ఉండటంతో, ఏదో ఒక విధంగా కేంద్రం నుంచి ఉదార సాహయం అందక పొతే, రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో చేతులు ఎత్తేయటం ఖాయం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, రాజకీయ పరిస్థితి కూడా కలిసి వచ్చింది. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతకు, ఇదే మంచి సమయం అని జగన్ కూడా భావిస్తున్నారని తెలుస్తుంది. కేంద్రం నుంచి శివసేన వైదోలగటంతో, బీజేపీకి ఉన్న ఒక నమ్మకమైన మిత్రపక్ష పార్టీ దూరం అయ్యింది. ఇప్పుడు కనుక బీజేపీకి దగ్గరయ్యి, ఎన్డీఏలో చేరితే, ఒక రెండు మంత్రి పదవులతో పాటుగా, కేంద్రం నుంచి నిధులు కూడా అధికంగా తెచ్చుకోవచ్చని, తద్వారా, రాష్ట్రంలో ఆదాయం పెరగక పోయినా, ఆర్ధిక పరిస్థితి నుంచి గట్టేక్కచ్చు అని జగన్ అభిప్రాయంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని, బీజేపీ పెద్దలు, దగ్గరకు రానివ్వకపోవటంతో, తానే స్వయంగా రంగంలోకి దిగి, బీజేపీ పెద్దల ముందు ఈ ప్రతిపాదన పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం.
అయితే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా, జగన్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే శివసేన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. శివసేన విభేదించినా, అది ఎప్పటికైనా బీజేపీతో కలుస్తుంది. ఎందుకంటే వారిది హిందుత్వ అజెండా. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై అనేక మత పరమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో, జగన్ మోహన్ రెడ్డిని, బీజేపీ దగ్గరకు తీసుకునే పరిస్థితి ఉండక పోవచ్చని తెలుస్తుంది. మరో పక్క ఇప్పటికే జగన్ తమ మాట వినటం లేదని, పీపీఏల విషయంలో కాని, పోలవరం విషయంలో కాని, ఇంటలిజెన్స్ చీఫ్ నియామకంలో కాని, తమ మాట లెక్క చెయ్యటం లేదని, సరైన విధంగా సమాధానం చెప్పటానికి, బీజేపీ పెద్దలు ఎదురు చూస్తున్నారని, ఈ తరుణంలో, ఇద్దరూ కలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. రాజకీయాల్లో ఏమైనా జరగోచ్చు అంటారు. చూద్దాం..