జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముఖ్యంగా రాజకీయంగా జగన్ ను బాగా ఇబ్బంది పెట్టే అంశం తిరుమల వెళ్ళినప్పుడు ఆయన తాను క్రీస్టియన్ అని చెప్పి, డిక్లరేషన్ ఇవ్వటం. గతంలో అనేకసార్లు ఈ అంశం తెర మీదకు వచ్చినా, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావటంతో, ఈ విషయం మరింతగా రాజకీయ విమర్శలకు కారణం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి కూడా, ఆ డిక్లరేషన్ ఇచ్చేస్తే అయిపోయే దానికి, ఆయన కూడా పంతానికి పోవటంతో, ఈ వివాదం పెద్దది అయ్యింది. ముఖ్యంగా మొన్న తిరుమల భ్రమోత్సవాలు సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే సందర్భంలో ఈ విషయం పెద్ద రచ్చ అయ్యింది. విపక్షాలు, హిందూ సంఘాలు, జగన్ మోహన్ రెడ్డి తనకు శ్రీవారి మీద విశ్వాసం ఉందని, డిక్లరేషన్ ఇవ్వాలని, ఆయన క్రీస్టియన్ కాబట్టి, చట్టాలకు సాంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని కోరాయి. ఈ సందర్భంగా టిడిడి చైరీన్, మంత్రులు వెల్లంపల్లి, మరో మంత్రి కొడాలి నాని, ఆయన డిక్లరేషన్ ఇవ్వరు ఏమి చేస్తారో చేసుకోండి అనే విధంగా మీడియాతో మాట్లాడారు. అలాగే అప్పటి ఈవో కూడా ఈ విషయం పై ఏమి స్పందించలేదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని , చట్ట ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని, మంత్రులు, అధికారులు కూడా జగన్ కు వంత పాడారు అని, దీని పై తగు ఆదేశాలు ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.
మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, టిడిపి చైర్మెన్, ఈవోలను బాధ్యులను చేయాలని కూడా కోరారు. అయితే దీని పై గతంలో విచారణ చేసిన హైకోర్టు, జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని ఆధారాలు చూపించమని అడిగింది. అయితే ఆయన క్రీస్టియన్ అంటూ, ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవటంతో, హైకోర్టు ఈ పిటీషన్ కొట్టేసింది. జగన్ మొహన్ రెడ్డి వ్యక్తిగత హోదాలో కాకుండా, సియం హోదాలో వెళ్ళారు కాబట్టి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పింది. వ్యక్తిగత హోదాలో వెళ్ళిన హిందూమతేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అయితే జగన్ మోహన్ రెడ్డి బైబిల్ చదివారని, చర్చకి వెళ్ళారని, ఆయన ఇంటి పై శిలువ గుర్తు ఉందని చెప్తున్నారని, అలా ఉంటే క్రీస్టియన్ అని ఎలా చెప్తారని, మొన్న జగన్ మోహన్ రెడ్డి గురుద్వార్ వెళ్ళింది అందరం చూసాం, ఆయన సిక్కు అవుతారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. జగన్ మోహన్ రెడ్డి టిటిడి ఆహ్వానం మేరకు, సియం హోదాలో వచ్చారు కాబట్టి, డిక్లరేషన్ అవసరం లేదని చెప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ప్రతి ఏడు ఆయన ఈ విమర్శ నుంచి తప్పించుకునే అవకాసం ఉంది. అయితే నైతికంగా మాత్రం ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.