రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని, జగన మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఒక రికార్డు అని అన్నారు. నిజమే గ్రామ వాలంటీర్లు ఒక పక్క, మరో పక్క గ్రామ సచివాయలం వ్యవస్థ ఏర్పాటుతో దాదపుగా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. అయితే ఈ గ్రామ సచివాలయంలో పది మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వేల పైచిలుకు గ్రామాల్లో ఒక్కో సచివాలయం ఏర్పాటు అవుతుంది. ఇంత వరకు బాగానే ఉంది. కొత్త ఉద్యోగాలతో రాష్ట్రం కళకళలాడుతుంది. అయితే ఇప్పటి వరకు అక్కడ పని చేస్తున్న వివిధ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రతి రోజు జగన్ తాడేపల్లి ఇంటి ముందు, ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వీరికి భరోసా ఇవ్వటం లేదు.

jagntweet 21072019 1

దీంతో ఈ ఉద్యోగాలు పై ఇప్పుడు భయం ఏర్పడింది. గ్రామ సచివాలయంలో పని చేసే పది మంది సిబ్బంది చేసే పని, ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి. వీరు ఎక్కువుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు. గ్రామ సచివాలయం ఏర్పాటు కాగానే, వీరిని తొలగిస్తారనే సమాచారం వస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సహకారం అందించే సెర్ప్‌ ఉద్యోగులు మరింత భయపడుతున్నారు. వీరే రాష్ట్ర వ్యాప్తంగా 41 వేల మంది ఉన్నారు. ప్రతి గ్రామ సమాఖ్యలో, ఒక గ్రామ సమాఖ్య అసిస్టెంట్‌ ఉంటారు. వీరే 27 వేల మంది ఉన్నారు. గతంలో వీరికి చంద్రబాబు 3 వేలు ఇస్తే, జగన్ రాగానే 10 వేలు చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే అసలు ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఇక భీమా మిత్ర, కళ్యాణ మిత్ర, కాల్ సెంటర్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితి.

jagntweet 21072019 1

ఇక అలాగే వ్యవసాయశాఖలో 4100 మంది, ఉద్యానవన శాఖలో 1200 మంది కూడా ఇలాగే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది గోపాల మిత్రలు ఉన్నారు. వీరి పని కూడా అయిపోయినట్టే అని తెలుస్తుంది. ఉపాధి హామీ పథకంలో పని చేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు, 10 వేల మంది దాకా ఉన్నారు. ఇలా అనేక మంది పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే వీరు అందరూ గ్రామాల్లో పని చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న గ్రామ సచివాలయంలో వీరినే పెట్టచ్చు, అలా కాకుండా మళ్ళీ నియామకాలు చేస్తున్నారు. గ్రామా వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కలిపి, మొత్తంగా గ్రామాన్ని బట్టి, వీరే 20 నుంచి 30 మంది దాకా ఉంటారు. దీంతో ఇక ఇప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను భరించే ఆర్ధికస్థోమత ప్రభుత్వానికి ఉండదు. మరి ఈ లక్ష మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమయినా చూపిస్తారా లేదా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read