అందరికీ షాకులు ఇచ్చే జగనే షాక్ అయ్యాడు అంట... ఏమి తెలియని అమాయకుడులా జగన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చూస్తే, అసలు నోట్లు వేలు పెడితే కొరకటం తెలియని పిల్లలు లాగా, నాకు అవినీతి అంటే ఏంటో తెలియదు అని జగన్ చెప్పినట్టు ఉంటుంది. ఈ రోజు అన్ని తెలుగు పత్రికల్లో, జాతీయ పత్రికల్లో జగన సతీమణి, భారతి పేరు ఈడీ చార్జిషీటులో వచ్చిందని రాసిన సంగతి తెలిసిందే. దీని పై జగన్ ఒక ట్వీట్ చేసారు, కొన్ని పత్రికలు కావాలని పనిగట్టుకుని, నా పై బురద చల్లుతున్నాయని, ఈ వార్తలు విని షాక్ అయ్యాను అని, రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోతున్నాయా అని జగన్ ఆవేదన ట్వీట్ చేసాడు.
చివరికి కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. అయితే జగన్ చేసిన ట్వీట్ మాత్రం కామెడీగా ఉంది.. భారతీ సిమెంట్స్ ఎవరిది ? ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయి ? దానికి అధినేత ఎవరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయం దర్యాప్తు సంస్థలు చెప్పాయి. దీనికి జగన్ షాక్ అయ్యేది ఏంటో మరి ?
ఈ వార్తల్లో తప్పు ఉంటే కనుక, ఇవి కోర్ట్ వ్యవహారాలు కాబట్టి, జగన్ వీరందరికీ నోటీసులు పంపించవచ్చు. అయినా, దేశంలో అన్ని పత్రికలు ఈ వార్తా రాసాయి. అడ్డంగా దొరికిపోయి, జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయట తిరుగుతూ, ఈ స్వాతి ముత్యం కబురులు ఏంటో మరి. ఈ ట్వీట్ ఎక్కడ నుంచి చేసారో తెలుసా ? అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వెళ్ళే కోర్ట్ గుమ్మం ముందు నుంచి. ఇలాంటి వాళ్ళు కూడా విలువులు, వంకాయ అంటే, ఇంకా ఏమి చెప్తాం... ఈ రోజు ప్రధానంగా ఉన్న రాంకీకి చెందిన చార్జీషీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి.