జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో యూ-టర్న్ కు సిద్ధం అయ్యింది. నిన్న రాజధానికి సంబంధించిన మూడు రాజధానుల బిల్లును, నిన్న ఉపసంహరించుకున్న ప్రభుత్వం, ఈ రోజు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేయాలని గతంలో, ఏపి ప్రభుత్వం కేంద్రానికి పంపిన తీర్మానాన్ని, మరో తీర్మానం ద్వారా ఈ రోజు ఉపసంహరించుకునేందుకు సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించి గతంలో, 2020 జనవరి 27వ తేదీన, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కూడా తీర్మానం చేస్తూ, శాసనమండలిని వెంటనే రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న శాసనమండలి, ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పి, కెంద్ర ప్రభుత్వానికి చెప్పి, శాసనసభ తీర్మానం చేసింది. క్యాబినెట్ చేసిన తీర్మానం, శాసనసభ తీర్మానం మేరకు, ఈ బిల్లుని కేంద్రానికి పంపింది. అయితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును , శాసనమండలి వ్యతిరేకించటంతో పాటుగా, సెలెక్ట్ కమిటీకి కూడా పంపాలని కూడా తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానం నేపధ్యంలో, తమకే ఎదురు చెప్తారా అనే ఉద్దేశంతో, శాసనమండలినే రద్దు చేసి పడేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం ఉండటంతో, వీళ్ళు మన మాట వినరు అనే ఉద్దేశంతో, జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేసారు.
అయితే అప్పట్లో జగన్ కి ఎంత మంది చెప్పినా వినలేదు. మళ్ళీ ఆరు నెలల్లో మనకే మెజారిటీ వస్తుందని చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి వినలేదు. తన మాటకు ఎదురు చెప్పిన మండలి ఉండటానికి వీలు లేదని తీర్మానించారు. అంతే కాదు, అసలు శాసనమండలి వెస్ట్ అని, ఒక్క రూపాయి కూడా దీని పైన ఖర్చు అనవసరం అని అన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం వచ్చింది. దీంతో జగన్ మడమ, మాట తిప్పేసి, యూ-టర్న్ తీసుకుని, అప్పట్లో ఇచ్చిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు అసెంబ్లీలో మరో బిల్లు పెట్టి, ఆ బిల్లుని కేంద్రానికి పంపనున్నారు. ఈ నెల 29 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పూర్తి మెజారిటీ వస్తుందని భావించి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న శాసనమండలి రద్దు బిల్లు కనుక కేంద్ర ఆమోదిస్తే, పూర్తిగా బకరాలు అవుతాం అని ఆశించిన జగన్ మోహన్ రెడ్డి, ఈ బిల్లు పైన కూడా మాట తప్పి, మడమ తిప్పేసి, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు.