వైకాపాలో ఐ ప్యాక్ చెప్పిందే వేదం. జ‌గ‌న్ రెడ్డి ఐ ప్యాక్ గీసిన గీత దాట‌డు. ఇది నిన్నా మొన్న‌టి మాట. ఇప్పుడు ఐప్యాక్ అంటే జ‌గ‌న్ యాక్ అంటున్నారు. ప్ర‌భుత్వంపై విప‌రీత‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త పెరిగిన నేప‌థ్యంలో జ‌నంతో జ‌గ‌న్ ఉండేలా ఐ ప్యాక్ కార్య‌క్ర‌మాలు రూపొందిస్తోంది. అస‌లు జ‌నం వ‌ద్ద‌కి వెళ్ల‌డం ఇష్టంలేని జ‌గ‌న్, తాను వెళ్ల‌కుండా త‌న పేరుతో ఓట్లు కొల్ల‌గొట్టే ప్ర‌ణాళిక‌లు ఇవ్వాలంటూ ఐప్యాక్ ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే ప‌ర‌దాలు, విప‌రీత‌మైన పోలీసు బందోబ‌స్తు, 10 కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి హెలికాప్ట‌ర్ వంటివి వాడుతున్న జ‌గన్...జ‌నం అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. స‌భ‌ల‌కి వ‌చ్చే జ‌నం కూడా త‌న మ‌నుషులే అయి ఉండాల‌న్న‌ట్టు, అక్క‌డ ఎవ‌రూ ఏ స‌మ‌స్య‌పై అడ‌గ‌కూడ‌ద‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఉప్పెన‌లో ఎగ‌సిప‌డుతున్న ప్రజావ్య‌తిరేక‌త నేప‌థ్యంలో అది జ‌ర‌గ‌ని ప‌ని. ఐప్యాక్ బాధ్య‌త‌లు చూస్తున్న‌ రుషిరాజ్ సింగ్ డిజైన్ చేసిన క్యాంపెయిన్ల‌న్నీ జ‌గ‌న్ రెడ్డిని జ‌నంతో ఇంటరాక్ట్ చేసేలా ఉన్నాయి. జ‌గ‌న‌న్న‌కి చెబుదాం అనే కార్య‌క్ర‌మం చాలా రోజుల క్రిత‌మే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జ‌గ‌న్ ఒప్పుకోక ఇన్నాళ్లూ వాయిదా ప‌డి ఇప్పుడు ఇలా పాత 1100ని నెంబ‌ర్ మార్చి 1902 పెట్టి జ‌గ‌న‌న్న‌కి చెబుదాం పేరుతో ప్రారంభించేశారు. ఐప్యాక్ చెప్పిన రోడ్లే వేయాలి, ఐప్యాక్ చెప్పిన వారికే టికెట్ అనే స్థాయి నుంచి ఐప్యాక్ చెప్పిన కార్య‌క్ర‌మం అంటే త‌రువాత ఆలోచిద్దాం అనేంత వెగ‌టుకి వ‌చ్చేశార‌ట జ‌గ‌న్ రెడ్డి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read