ఏమి జరుగుతుంది ? నేను 400 కిమీ నడిచాను అని మీకు తెలుసా ? అసలు ప్రజలకు నేను ఒకడిని ఉన్నాను అని గుర్తుందా ? మన పేపర్ లో తప్ప, ఈ నెల రోజుల్లో నా ఫోటో మెయిన్ పేజిలో వేసారా ? మన టీవీలో తప్ప, నా నడక ఎవరైనా లైవ్ ఇస్తున్నారా ? చివరకి సోషల్ మీడియాలో కూడా నా గురించి మన వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు... ఎందుకు జరుగుతుంది ఇది ? సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్ తప్ప, నా గురించి, నా పాదయాత్ర గురించి ఎక్కడన్నా చుపిస్తున్నారా ? మన సాక్షి టీవీ, పేపర్ లో ఎన్నో క్రియేటివ్ స్టొరీలు వస్తున్నాయి, మిగతా చానల్స్ ఎందుకు ఆ క్రియేటివ్ స్టొరీలు వెయ్యటం లేదు ? ఏమి జరుగుతుంది అంటూ అటు పార్టీ ముఖ్యలను, ఇటు ప్రశాంత్ కిషోర్ టీంను దుమ్ము దులిపేసారు జగన్...

jagan weekend 09122017 2

నా కళ్ళు బొబ్బలు వచ్చేలా నడుస్తుంటే, మీరందరూ ఏమి చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు... నాలుగు రోజులు నుంచి, మహేష్ కత్తి అనే వాడు సాయంత్రం అయితే అన్ని టీవీల్లో లైవ్ లో వస్తున్నాడు... కత్తి మహేష్ స్థాయి చెయ్యనా నేను ? ఏంటయ్యా ఇది ? ఒక రోజు బోటు ప్రమాదం అంటారు.. ఒక రోజు ఇవంకా అంటారు... ఒక రోజు హైదరాబాద్ మెట్రో అంటారు... ఒక రోజు నంది అవార్డులు అంటారు... ఒక రోజు పవన్ కళ్యాణ్ అంటారు... ఒక రోజు పోలవరం అంటారు.. ఒక రోజు రిజర్వేషన్ అంటారు... నాకు ఎందుకు అవన్నీ ? నా ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇంత ఇబ్బంది పడుతుంటే, ఇవన్నీ నాకు ఎందుకు ? మీరు ఏమి చేస్తారో నాకు తెలీదు, రేపటి నుంచి మన పాదయాత్ర గురించి అన్ని టీవీలు మాట్లాడుకోవాలి అంటూ జగన్ ఆర్డర్ వేశారు...

jagan weekend 09122017 3

జగన్ కోపం గ్రహించిన నాయకులు ఏమి మాట్లాడలేకపోయినా, ప్రశాంత్ కిషోర్ టీం మాత్రం, అద్భుతమైన ఐడియా ఇచ్చారు... మనం ఈ హామీలు, క్రియేటివ్ స్టొరీలు పక్కన పెట్టి, మరో సారి చంద్రబాబుని ఉరి వేద్దాం, నరికేస్తాం, కాల్చేస్తాం అనే వ్యాఖ్యలు చేద్దాం... మీరు ఇంకాస్త ముందుకు వెళ్లి బూతులు తిట్టినా పర్వాలేదు... అప్పుడు లోకల్ ఏమి ఖర్మ, నేషనల్ చానల్స్, పేపర్లు కూడా మన గురించే మాట్లాడుకుంటాయి... అప్పుడు కత్తి మహేష్ కంటే, మీకు ఎక్కువ పుబ్లిసిటీ వస్తుంది అంటూ ప్రశాంత్ కిషోర్ టీం మెంబెర్ ఐడియా ఇచ్చారు... దీంతో పాటు మరేదన్నా మంచి ఐడియా కూడా కావలి అని జగన్ అడిగారు... అవసరమైతే ప్రశాంత్ కిషోర్ ని అనంతపురం రమ్మని జగన్ చెప్పారు.. ఏది ఏమైనా, రేపటి నుంచి అందరూ నా గురించే మాట్లడుకునేలా చెయ్యాలి అని, జగన్ ఆర్డర్ వేశారు... మరి రేపటి నుంచి ఏమవుతుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read