జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, రెండో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మొదటి పర్యటనలో ఆయన జేరాసులాం వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని ప్రచారం జరిగింది. జీవో లో కూడా అదే రాసారు. అయితే, ఆయన భద్రతకు అని చెప్పి, 22 లక్షలు విడుదల చెయ్యటం మాత్రం, పెద్ద రచ్చ అయ్యింది. ఇది ఏకంగా నేషనల్ మీడియాలో కూడా రావటంతో, అందరూ దీన్ని తప్పుబట్టారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత, రెండో సారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అయితే, ఇక్కడ మాత్రం లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు.
మొన్నటి దాక తన అమెరికా పర్యటన వ్యక్తిగతం అని చెప్పారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నాను కాబట్టి, ఈ ఖర్చులు నావే అని చెప్పారు. అయితే, నిన్న రిలీజ్ అయిన జీవోలో మాత్రం, జగన్ గారు అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారని చెప్పింది. అక్కడే కొన్ని వ్యక్తిగత పనుల్లో కూడా పాల్గుంటారని చెప్పింది. అయితే ఇక్కడ కూడా మరో జీవో రిలీజ్ చేసారు. అది కూడా సెక్యూరిటీ కోసం అని, అంతే కాక, జగన్ తో పాటు, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ముఖ్యమంత్రికి సహాయకుడి హోదాలో అమెరికా వెళ్తున్నారు. అంతే కాక ఆయన ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీపీ) భాగస్వామ్య డైరెక్టర్ మాలతి స్వామినాథన్, సీనియర్ అసోసియేట్ సావన్ తీర్థేలకూ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
అయితే ఈ సారి మాత్రం, ఈ అధికారులకు ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం జీవో లో ఇవ్వలేదు. అయ్యే ఖర్చులు అన్నీ ప్రభుత్వం భరించాలి అన్నారు. అంటే మొన్నటి పర్యటన లాగే, జగన్ గారు మాత్రం, ఆయన సొంత ఖర్చుతో వెళ్తున్నారు అనేది ప్రజలకు చెప్తున్నారు. అయితే మొదట జగన్ అమెరికా పర్యటన అనే వార్తలు వచ్చినప్పుడు, ఆయన డల్లాస్ లో వైసిపీ కార్యకర్తలతో మీట్ అవుతారు అని మాత్రం చెప్పారు. తరువాత రెండు రోజుల నుంచి, ఆయన చిన్న కూతురుని కాలేజీ లో జాయిన్ చెయ్యటానికి అని చెప్పారు. నిన్న విడుదల చేసిన జీవోలో ఇవేమీ కాని, ఆయన అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు, దాంతో పాటు పర్సనల్ పనులు చూసుకుంటారని చెప్పింది. మొత్తానికి, ఇన్ని ట్విస్ట్ లు మధ్య, జగన్ గారు అధికారిక పర్యటనకు వెళ్తూ కూడా, ఆయనే సొంత ఖర్చులతో అమెరికా వెళ్తున్నారని వైసీపీ చెప్తుంది.