ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాష్ట్ర సంపద దోచేసి, చివరకు 11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో A1గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లి దాకా వెళ్ళాల్సిన పని లేదా ? నాంపల్లి బదులు విజయవాడ వస్తే చాలా ? సుప్రీమ్ కోర్ట్ చెప్పిన దానికి, రాష్ట్ర ప్రభువం ఏమి చేసింది ? వీటి గురించి తెలుసుకోవాలంటే, ఇది చదవాల్సిందే... ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా దీన్ని నెలకొల్పనుంది.

jagan court 01032018 2

ఆంధ్రప్రదేశ్ భూభాగ మంతా ఈ ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది. దీని కోసం కొత్తగా ఒక జిల్లా జడ్జి పోస్టు సహా మొత్తం 29 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి వేతనాల కింద ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు కానుంది. దేశవ్యాప్తంగా నేరారోప ణలు ఎదుర్కొంటున్న 1,581 మంది శాసనకర్తల పై విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించగా.. దేశవ్యాప్తంగా 12 చోట్ల వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 14వ తేదీన సుప్రీంకోర్టుకు వివరించింది. అయితే 2018 మార్చి ఒకటో తేదీలోగా ఆ న్యాయస్థానాలన్నీ పనిచేసేటట్లు చూడాలని సుప్రీం అదే రోజు ఆదేశించింది.

jagan court 01032018 3

ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. ఒక్కో న్యాయస్థానం ఏడాదికి 165 కేసులు పరిష్కరించేం దుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి దుప్పల వెంకటరమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులు తమ పరిధిలోని కేసుల్లో నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను విడదీసి ఈ ప్రత్యేక న్యాయస్థానాలకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే జగన్ వెళ్ళేది, నాంపల్లి సిబిఐ కోర్ట్ కాబట్టి, జగన్ కేసు కూడా ఈ ప్రత్యెక న్యాయస్థానానికి బదిలీ చేస్తారా అనేది చూడాలి... ఎందుకంటే, సిబిఐ కేసులు కూడా, దశాబ్దాల తరబడి విచారణలో ఉన్న విషయం చూసాం... మరి జగన్ కేసు కూడా విజయవాడకు పంపిస్తారో లేదో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read