వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, అత్యంత ఆప్తుడు, అన్నిట్లో వెన్ను దన్నుగా ఉంటూ, చివరకు జైలుకు వెళ్ళినప్పుడు కూడా తోడుగా ఉన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, జగన్ మోహన్‌రెడ్డి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువత, అధికారం లేక ముందు కూడా, జగన్ మోహన్ రెడ్డి తరువాత, అంతా తానే అన్నట్టుగా, విజయసాయి రెడ్డి నడిపించుకుంటూ వచ్చారు. ఆయన చేసిన సేవలకు మెచ్చిన్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. అంతే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా, విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిని చేసారు. ఇప్పుడు అధికారం రావటంతో, విజయసాయి రెడ్డికి మరో పదవి కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తున్నట్లు ఈ రోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం, ఇక పై విజయసాయి రెడి కేబినెట్ మంత్రి హోదా కలిగి ఉత్నారు.
దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొద్ది సేపటి క్రిందట జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసారు. అయితే, ఈ పదవికి సంబధించి, మిగతా విధి విధానాలు, త్వరోలేనే ప్రకటిస్తామని జీఓలో రాసారు. అంటే ఆయన చేసే పని ఏంటి, జీతం ఎంత, ఎంత మంది ఆయన కింద పని చేస్తారు, లాంటి అంశాలు తరువాత చెప్తామంటూ జీఓలో రాసారు. మరో పక్క, ఈ పదవి విజయసాయి రెడ్డికి పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, గత 5 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీని కాదని మరీ, విజయసాయి రెడ్డికి ఢిల్లీలో బీజేపీ పెద్దలు ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏకంగా ప్రధాని కార్యాలయంలోకి వెళ్ళిపోయే చనువు ఆయనకు ఉంది. మొన్న ప్రధాని, హాయ్ విజయ్ గారు అని పలకరించటం కూడా చూసాం. ఇంత లాబీయింగ్ తెలిసిన విజయసాయి రెడ్డికి ఈ పదవి కొత్తగా ఏమి ఉండదని, ఎందుకంటే ఆయన ప్రతి రోజు చేసేది ఈ పనే అని విశ్లేషకులు అంటున్నారు.