చంద్రబాబు అధికారంలో ఉండగా, 29 సార్లు మోడీ చుట్టూ తిరిగారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేర్చలాని, అడుగుతూనే ఉన్నారు. చివరి సంవత్సరంన్నర కాలంలో పోరాటాలు కూడా చేసారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెడలు వంచి సాధిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కూడా. మొదటి ప్రెస్ మీట్ లో సర్, ప్లీజ్ సర్ ప్లీజ్ అనే మాటలు విన్నాం. నిన్న తిరుమలలో మెడలు వంచకుండా, నడుము వంచటం చూసాం. రాష్ట్రానికి ఏమేమి రావాలో, జగన్ మోడీకి విన్నవించారు. అయితే అప్పట్లో 29 సార్లు చంద్రబాబు ఏదైతే అడిగారో, ఇప్పుడు జగన్ కూడా అదే మోడీని అడిగారు. మరి అప్పట్లో చంద్రబాబు పై చేసిన విమర్శలు సంగతి ఏంటి . మరి ఆ నాటి విమర్శలు ఇప్పుడు గుర్తుకు లేదా ?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈవిధంగా ఉందంటూ సీఎం ప్రధాని మోడీకి ఓ వినతిపత్రం ఇస్తామని అనుకున్నప్పటికీ అయితే ఆ వివరాలను లెక్కల రూపంలో ప్రధాని పర్యటనలో క్షుణ్ణంగా వివరించినట్లు సమాచారం. ఏపిీకి రూ. 74,169 కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మాటల్లో విన్నవించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపికి రూ. 18,969 కోట్లు రావాల్సి వుందని, వాటిని విడుదల చేయాలని జగన్ ప్రధానిని ప్రత్యేకంగా కోరారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలోని 10 నెలల రెవెన్యూ లోటు రూ. 16,078 కోట్లు కాగా కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ. 3979 కోట్లు వచ్చాయి. వేస్ అండ్ మీన్స్ సందిగ్ధత వల్ల రూ. 6,870 కోట్ల ఖర్చును ఆ ఆర్ధిక సంవత్సర రెవెన్యూ లోటులో చూపలేక పోయారు. ఇవి రెండూ కలిపితే రెవెన్యూలోటు రూ. 22,948 కోట్లకు చేరుకుంటుంది. 2014-15 ఆర్ధిక సంవత్సర రెవెన్యూ లోటులో రూ. 16,078 కోట్లలో రూ. 4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో రూ. 3979 కోట్లు ఇవ్వగా, ఇంకా 138.39 కోట్లు రావాల్సి ఉంది.
వేస్ అండ్ మీన్స్ సందిగ్ధత వల్ల రెవెన్యూ లోటులో చేర్చని రూ. 6870 కోట్లలో పిఆర్సి ఎరియర్స్ రూ. 3,920 కోట్లు, బిల్లులు రూ. 2,950 కోట్లు రాబడి నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం రెవెన్యూ లోటు రూ. 22,948 కోట్లలో ఇప్పటివరకు రూ. 3979 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రూ. 18,969 కోట్లు రావాల్సి ఉంది. విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్ 50, సెక్షన్ 51లను సవరిస్తే ఏపికి అధనంగా రూ. 3,820 కోట్లు వస్తాయని, ఈసెక్షన్‌ను సవరించి ఏపికి న్యాయం చేయాలని ఏపిలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ. 350 కోట్లు ఇస్తున్నారు. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది రూ. 350 కోట్లను ఏపిీ ఖాతాలో వేసి వెనక్కు తీసుకున్నారు. ఐదో ఏడాది అసలు నిధులే ఇవ్వలేదు. నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతి అయోగ్ కూడా కోరినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు ఆ నిధులు విడుదల చేయక పోవడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో జగన్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికోసం ఆ నిధులను వాటిని తక్షణమే విడుదల చేయాలని ప్రధానిని తిరుపతి తిరుమల పర్యటనలో అభ్యర్ధించారు. అలాగే రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్ ఖండ్ ప్యాకేజి ఇవ్వాలని, ఇందుకు గాను రూ. 23,300 కోట్లు విడుదల చేయాలని ఏపి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోడీని కోరారు.